పీకే సర్వేలు వైసీపీకి అలా కలిసొస్తున్నాయా ..?  

Prashant Kishor Survey Favor To Ys Jagan-

ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ సర్వే జపం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటి .? ఏ అభ్యర్థి పనితీరు ఎలా ఉంది.? గెలుపు గుర్రాలు ఎవరు ..

పీకే సర్వేలు వైసీపీకి అలా కలిసొస్తున్నాయా ..? -Prashant Kishor Survey Favor To Ys Jagan

? ఇలా అనేక అంశాల మీద ఇప్పుడు సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజల నాడి ఎలా ఉంది అని తెలుసుకునేందుకు పార్టీలు తెగ హైరానా పడుతున్నాయి.

ఒకవైపు చూస్తే ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. దీంతో పార్టీ సర్వేలతో పాటు కొందరు నాయకులు, ఎమ్యెల్యేలు, మంత్రులు ఎవరికి వారు ప్రైవేట్ ఏజెన్సీలు, ప్రైవేట్ వ్యక్తులతో తమ నియోజకవర్గాల్లో తమ పనితీరు ఎలా ఉంది అనేదానిపై సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు.

ఇక ఏపీ విషయానికి వస్తే .

ఇక్కడ సర్వేల గోల మాములుగా లేదు అధికార పార్టీ టీడీపీ ప్రెయివేట్ ఏజన్సీలతో పాటు ఇంటలిజెన్స్ . పోలీస్ తదితర శాఖలను ఉపయోగించుకుని ఎప్పటికప్పుడు పార్టీ , ప్రభుత్వ పరిస్థితి తెలుసుకుంటూ జాగ్రత్తపడుతోంది. ఇక ప్రతిపక్ష వైసీపీ విషయానికి వస్తే. వైసీపీ కూడా అనేక సర్వేలను నమ్ముకుంది. దీనికి తోడు ఆ పార్ట్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన బృందం తో సర్వేల్లో మునిగితేలింది. వైసీపీ ఎక్కడెక్కడ బలంగా ఉంది ..

? టీడీపీ లో బలమైన నాయకులు ఎవరు.? వారు ఏ ఆఫర్ ఇస్తే పార్టీ మారే అవకాశం ఉంది ఇలా అనేక విషయాలపై జగన్ కు ఎప్పటికప్పుడు రిపోర్ట్ అందిస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో పీకే టీం రెండు విడతలుగా చేసిన సర్వేలో జిల్లాలో టీడీపీ ప్రభావం గత ఎన్నికలతో పోలిస్తే. గణనీయంగా తగ్గినట్టు ఆ సర్వేలో వెల్లడయినట్టు పీకే టీమ్ జగన్ కు రిపోర్ట్ అందించింది.

జిల్లా లో గత ఎన్నికల్లో పదిహేను అసెంబ్లీ , రెండు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ ఓడిపోయింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి ఎవరెవరిని నిలబెట్టాలి .? పార్టీ తరపున బలమైన అభ్యర్థులు ఎవరవుతారు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ మైనెస్ పాయింట్లు ఏంటి అనే విషయాలను పీకే టీమ్ కూపీ లాగింది. ప్రశాంత్ కిశోర్ పశ్చిమ గోదావరి జిల్లాలో చేసిన సర్వేలో జిల్లాలో ఐదు సెగ్మెంట్లలో మాత్రమే టీడీపీ విజయం సాధిస్తుందని, మిగిలిన పది నియోజకవర్గాల్లో పార్టీ గట్టి అభ్యర్థులను నిలబెట్టి. కష్టపడితే సానుకూల ఫలితాలు లభిస్తాయని తేలిందట..

పీకే అందించిన రిపోర్ట్స్ తో కొంతమంది టీడీపీ నాయకులను పార్టీలోకి ఆహ్వానించేందుకు జగన్ పావులు కదుపుతున్నట్టు సమాచారం.