వైసీపీకి పీకే రామ్ రామ్ ! అసలు రీజన్ ఏంటి  

Prashant Kishor No More Work To Gather With Ys Jagan-

ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ! ఈ పేరు కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో పాపులర్ అయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సలహాదారుగా ఉన్న పీకే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ని అధికారంలోకి తీసుకురావడమే పనిగా తన వ్యూహాలు రూపొందిస్తూ పార్టీని గదిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పీకే వచ్చాక జగన్ లో కూడా ఒకరకమైన ధైర్యం కనిపిస్తోంది. ఇక అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో పీకే వైసీపీ వ్యవహారాలు ఇక చూడబోనని, నేను ఆ పార్టీ తరపున ప్రచారం చేయడం లేదని ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచాడు. అయితే తనను లేకపోయినా తన టీమ్ మాత్రం వైసీపీ తరపున పనిచేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అనూహ్యంగా పీకే ఇటువంటి ప్రకటన చేయడం వెనుక కారణం ఏంటి? జగన్ కు ఆయనకు మధ్య విబేధాలు వచ్చాయా , పీకే ఎందుకు వైసీపీకి దూరం అవుతున్నాడు ఇలా సవాలక్ష సందేహాలు వస్తున్నాయి.

Prashant Kishor No More Work To Gather With YS Jagan-

Prashant Kishor No More Work To Gather With YS Jagan

ప్రశాంత్ కిషోర్- జగన్ మధ్య అసలు ఏమి జరిగింది అనే విషయం గురించి వైసీపీలో ఓ కీలక నేత చెప్పిన వివరాల ప్రకారం… ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వంతా ప్రాధాన్యత జగన్ ఆయనకు ఇచ్చాడు. కానీ పీకే వైసీపీ విషయంలో అంత శ్రద్ద పెట్టలేదు అన్నట్టుగా ఆ నేత చెప్పుకొచ్చాడు. కొంత కాలం క్రితం చంద్రబాబుకు వ్యతిరేకంగా, వైకాపాకు అనుకూలంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా ప్రశాంత్ కిషోర్ కొన్ని ఇష్యూస్ రూపొందించాడు. అయితే 2014 ఎన్నికల్లో మోడీ గెలవడానికి ఏ సోషల్ మీడియా అకౌంట్స్‌ని ఉపయోగించాడో వైకాపా ప్రచారానికి కూడా అవే అకౌంట్స్ వాడాడు. కానీ అవన్నీ నార్త్ ఇండియా వ్యక్తుల పేర్లతో ఉన్న అకౌంట్సే కావడంతో సోషల్ మీడియాలో వైసీపీ అభాసుపాలయ్యింది. దాంతో వైసీపీలో పీకే ప్రోటోకాల్ తగ్గిపోయింది. అంతే కాదు మోదికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దంటూ అయనపై ఒత్తిడి కూడా పెరిగిపోయింది.

Prashant Kishor No More Work To Gather With YS Jagan-

అలాగే కేంద్రంలో ప్రముఖ స్థానంలో ఉన్న బాబుకు సన్నిహితుడు అయిన ఒక బిజెపి నాయకుడు కూడా వైకాపా గెలుపు కోసం పనిచేసే విషయంలో ప్రశాంత్ కిషోర్‌ని వెనక్కి తగ్గేలా చేశాడట. జగన్‌తో కమ్యూనికేషన్ గ్యాప్‌తో పాటు అన్ని వైపుల నుంచి ఒత్తిళ్ళు రావడంతో 2019 ఎన్నికల నుంచి ప్రశాంత్ కిషోర్ పూర్తిగా తప్పుకున్నాడని సమాచారం. పీకే ఉన్నా లేకపోయినా వైసీపీ విజయానికి వచ్చిన డోకా ఏమి లేదని , ఆయన పార్టీకి అనవసర భారం తప్ప పెద్దగా ఉపయోగపడింది ఏమి లేదంటూ వైసీపీ నాయకులు చెప్పుకొస్తున్నారు.