అంకుల్ .. మీ అమ్మాయి విషయంలో మీరనుకుంటునట్టుగా.... మారుతీరావు గురించి ప్రణయ్ డైరీలో రాసింది ఇదే.!  

Pranay Dairy Secrets About Amrutha-

ప్రణయ్ అమృత ల లవ్ స్టోరీ తెలుగు రాష్ట్ర ప్రజలను ఎంత కన్నీళ్లు పెట్టించిందో అందరికి తెలిసిందే. ప్రణయ్ హ‌త్య‌పై పోరాటం ప్రారంభించారు అమృత. ప్రణయ్‌ని చంపిన వాళ్లను శిక్షించటానికి, పుట్టబోయే బేబీని పెంచి పెద్ద చేస్తానని చెప్పారు..

అంకుల్ .. మీ అమ్మాయి విషయంలో మీరనుకుంటునట్టుగా.... మారుతీరావు గురించి ప్రణయ్ డైరీలో రాసింది ఇదే.!-Pranay Dairy Secrets About Amrutha

పెళ్ళికి ముందే మూడు కోట్లు ఇస్తానని మారుతి రావు ఆఫర్ చేసిన ప్రణయ్ ప్రేమకే విలువనిచ్చాడు. చివరికి హత్యకు గురయ్యారు.

ఇది ఇలా ఉండగా…ప్రణయ్ డైరీలో రాసుకున్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రేమ పెళ్లి గురించి డైరీలో ప్రణయ్ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం తప్పా అంటూ ఆయన ప్రశ్నించాడు. అంతేకాదు మారుతీరావును ఉద్దేశించి కూడ ప్రణయ్ కూడ డైరీలో కీలక విషయాలను ప్రస్తావించాడు. అంకుల్ మీ కూతురికి మీరనుకొంటున్నట్టుగానే మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌ను నేను అవుతానని రాశాడు.

మీరు మీ అమ్మాయికి తెచ్చే అబ్బాయిలో ఉండే పర్‌ఫెక్ట్ లక్షణాలు ఏవైతే కోరుకొంటున్నారో…ఆ లక్షణాలు తనలో ఉన్నాయని ప్రణయ్ ఆ డైరీలో రాసుకొన్నాడు.నాకు మీ అమ్మాయే ప్రపంచం . మీరు సెలెక్ట్ చేసే అబ్బాయిని కాకపోవచ్చు. కానీ మీ అమ్మాయిని అమ్మ ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమిస్తానని ప్రణయ్ రాసుకొన్నాడు. నాన్న ప్రేమకు కూడ లోటు రానివ్వనని చెప్పారు. నాకు అక్కా చెల్లెలు..

అన్నదమ్ములు ఉన్నారు. వయస్సులో ఉండే చిలిపితనం తప్ప… మీరు అనుకొనే మిస్టర్ ఫర్‌ఫెక్ట్ లక్షణాలు నాలో ఉన్నాయని ప్రణయ్ డైరీలో రాసుకొన్నాడు.

చెడు అలవాట్లు ఉంటే ఆ అబ్బాయిని తిరస్కరించాలని కూడ ప్రణయ్ తన డైరీలో రాసుకొన్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నలుగురు స్నేహితులు ఉంటే సరిపోతోందన్నారు. జీవితాంతం కలిసి బతకాలంటే పెద్దల సహకారం అవసరమని ప్రణయ్ డైరీ చెప్పాడు.

కులం, మతం, ఆస్తి పాస్తుల విషయాన్ని చూపి ప్రేమికులను విడదీయకండని ప్రణయ్ డైరీలో రాశాడు.మీ అమ్మాయిని పెళ్లి చేసుకొంది ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడానికే మాత్రమేనని ప్రణయ్ ఆ డైరీలో రాసుకొన్నాడు. మందు,సిగరెట్ ఇతర చెడు అలవాట్లు ఉన్న పేరేంట్స్ ను రిజెక్ట్ చేయాలని రాసుకొన్నాడు..

చదువులేని వారిని రిజెక్ట్ చేయాలని రాసుకొన్నాడు. మరోవైపు ప్రేమికుల మధ్య ఏదైనా పొరపొచ్చాలు వస్తే వారిద్దరిని విడదీసేందుకుగాను ప్రయత్నించేవారు ఎక్కువగా ఉంటారని చెప్పారు.

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పా అంటూ ప్రణయ్ డైరీలో రాసుకొన్నాడు.

ప్రతి చరిత్రలో కూడ ప్రేమలేని కథ ఉండదన్నారు. ప్రేమలేని జీవితం పూర్తి కాదన్నారు. ప్రేమను ప్రేమగా చూడాలని ఆయన కోరారు.

నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదన్నారు. ప్రేమను. ప్రేమించిన అమ్మాయిని అంత సులభంగా ఎలా మర్చిపోతామని ప్రణయ్ డైరీలో రాసుకొన్నాడు. కూతురు ఎక్కడైనా తిరగొచ్చు కానీ. ప్రేమించినవాడిని పెళ్లి చేసుకోకూడదా అంటూ ప్రణయ్ డైరీలో రాసుకొన్నాడు.ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించని ప్రేమను రిజెక్ట్ చేయాలని… ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలను కారణంగా చూపుతూ ప్రేమను రిజెక్ట్ చేయొద్దని ప్రణయ్ రిక్వెస్ట్ చేశాడు.