ప్రభాస్‌ మూవీకే ఎందుకు ఇలా జరుగుతుంది.. ఫ్యాన్స్‌ ఆందోళన  

Prabhas Fans Tense With Sahoo Movie Release-

ప్రభాస్‌, శ్రద్దా కపూర్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయి బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు సుజీత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు...

ప్రభాస్‌ మూవీకే ఎందుకు ఇలా జరుగుతుంది.. ఫ్యాన్స్‌ ఆందోళన-Prabhas Fans Tense With Sahoo Movie Release

భారీ అంచనాలున్న ఈ చిత్రంను మొదట వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయాలని భావించారు. కాని చిత్రీకరణ అనుకున్న సమయంకు ప్రారంభం కాని కారణంగా వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. కాని ఇప్పుడు వచ్చే సమ్మర్‌లో కూడా సినిమా విడుదల అనుమానమే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

గత రెండు మూడు నెలలుగా చిత్రీకరణ జరుగుతున్న దాఖలాలు లేవని, షూటింగ్‌ కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి కారణాల వల్ల సినిమా మళ్లీ కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. దుబాయి షెడ్యూల్‌ పూర్తి చేసుకుని నెలలు గడుస్తున్నా కూడా కొత్త షెడ్యూల్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. అమెరికా లేదా స్పెయిన్‌లో కొత్త షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రారంభించి పూర్తి చేయాల్సి ఉంది.

కాని స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పుల కారణంగా సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది..

సినిమా షూటింగ్‌ వాయిదా వేయడంతో బడ్జెట్‌ మరింతగా పెరుగుతుంది అంటూ సమాచారం అందుతుంది. బడ్జెట్‌ పెరగడం వల్ల సినిమాపై ఒత్తిడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలా దర్శకుడు అటు ఇటు అయ్యే అవకాశం ఉందని, ఫలితం తేడా కొట్టే అవకాశం లేకపోలేదు అంటూ ఆందోళన వ్యక్తం అవుతుంది.

సినిమా ఆలస్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు సినీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...

250 కోట్ల బడ్జెట్‌ చిత్రం ఇలా పదే పదే స్క్రిప్ట్‌ మార్పులు చేయడం ఏంటీ అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు స్క్రిప్ట్‌ వర్క్‌ అంటూ స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పు చేస్తూ వస్తున్నారు. చివరకు ఏం చేస్తారో అంటూ ప్రభాస్‌ అభిమానులు ఆందోళనలో ఉన్నారు.