అంత రచ్చ చేయడం అవసరమా ... ఆ పార్టీలోనే కాదు మీ పార్టీలోనూ ఇంతే..!  

Political Counter Between Telugu Desam And Ysrcp-

The disadvantages and disagreements seen in the YSR Congress party are now beginning to appear in the ruling party TDP. While the situation in TDP is currently well known, the leaders seem to be deeply dissatisfied. Intelligence reports say that even now TDP has no positive winds. Even though it is not visible, it seems to be more of TDP than it is in the disadvantage of the Vishipi. In the last election, 23 people who won on the TCP ticket were chaired by TDP chief Chandrababu's office. In fact, the ticket was given to them in the next election. But, as the election time approaches, this strategy seems to be exceptional. It seems that she has decided not to give a ticket to around 15 people.

.

Chandrababu, who has been receiving survey reports on the leadership of the leaders, is making decisions accordingly. Sasimira said to give some leaders a ticket. But do they do that? It is also reported that the sitting TDP will alter candidates in various constituencies, including Shinganamala in MLAs. In view of this, the constituents of the constituencies are common. However, TDP leaders are notorious for commenting on these issues. . Recently, Nellore district Venkatagiri VCP coordinator Bommi Reddy Raghavendra Reddy said the leaders of the ruling party are worse offensive in the wake of the allegations. TDP leaders are forgetting that they are forgetting

. The next elections have become prestigious. The victory horse is not easy to get. In the wake of the trilateral competition, the money flow will be in the range of the elections. In this context, Jagan has been replaced by various changes to defeat the ruling party leaders and come to power. TDP should also follow Jagan in the face of election time. .

..

..

..

ఇప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కనిపించిన అసంతృప్తులు, అలకలు ఇప్పడు అధికార పార్టీ టీడీపీ లో కూడా మొదలవుతున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ లో పరిస్థితులు ప్రస్తుతానికి బాగా ఉన్నట్టు కనిపిస్తున్నా. లోలోపల మాత్రం నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం కూడా టీడీపీకి అంత అనుకూల ప‌వ‌నాలు వీస్తున్న‌ట్టుగా లేవ‌ని ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ అందుతున్నాయట. పైకి కనిపించకపోయినా...

అంత రచ్చ చేయడం అవసరమా ... ఆ పార్టీలోనే కాదు మీ పార్టీలోనూ ఇంతే..! -Political Counter Between Telugu Desam And YSRCP

వైసీపీలో చెలరేగుతున్న అలజడులకంటే ఎక్కువగా టీడీపీలో ఎక్కువగా ఇది ఉన్నట్టు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై గెలుపొందిన 23 మందిని టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు ఆఫరేషన్ ఆకర్ష్ పేరుతో పార్టీలో చేర్చుకున్నారు. వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికే టికెట్ ఇస్తామ‌ని చెప్పుకొచ్చారు.

కానీ, ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఈ వ్యూహం అనూహ్యంగా మారిపోయే ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి. వీరిలో దాదాపు 15 మంది కి టికెట్ ఇవ్వకూడదని బాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

నాయకుల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్న చంద్రబాబు దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అనుకూ కొంతమంది నాయకులకు బాబు టికెట్ ఇచ్చేందుకు ససేమీరా అంటున్నాడు. అయితే ఇలా చేస్తే.

వారు అసంతృప్తికి గురి కారా ? అదే విధంగా సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేల్లో శింగ‌న‌మ‌ల స‌హా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను మారుస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుంటే...

ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అసంతృప్తులు రావ‌డం కామ‌న్‌. కానీ, ఈ విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకోకుండా టీడీపీ నాయ‌కులు వైసీపీని టార్గెట్ చేయ‌డం దారుణ‌మనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

తాజాగా నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి వైసీపీ స‌మ‌న్వ‌య క‌ర్త బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర‌రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో అధికార ప‌క్షం నాయ‌కులు పెద్ద ఎత్తున విరుచుకుప‌డ‌డం దారుణంగా ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. గ‌తానుభ‌వాల‌ను టీడీపీ నాయ‌కులు మ‌రిచి పోతున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. గెలుపు గుర్రం ఎక్క‌డం అంత ఈజీ కూడా కాదు.

త్రిముఖ పోటీ ఉంటుంద‌ని చెబుతున్న నేప‌థ్యంలో వచ్చే ఎన్నిక‌ల్లో ధ‌న ప్ర‌వాహం కూడా ఆదే రేంజ్ లో ఉంటుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ నేత‌ల‌ను ఓడించి అధికారంలోకి వ‌చ్చేందుకు జగన్ రకరకాల మార్పు చేర్పులకు దిగుతున్నాడు. ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ కూడా జగన్ ని అనుసరించక తప్పదు...