ఆ ఊర్లో ఒకర్నొకరు విజిలేసుకుని పిలుచుకుంటారు.. వింతగా ఉన్నా అదే నిజం .కావాలంటే మీరే చూడండి.  

People Of This Meghalaya Village Use Unique Tunes Instead Of Names-

కుకూకుకూకూ….కుకూకుకూకూ… నిన్నే పిలుస్తున్నా పలకవేం. నన్నా ఏమని పిలిచావ్. కుకూకుకూకూ. అదేంపిలుపు…అదే పిలుపు.నీ పేరు. ఏంటి నా పేరు కుకూకుకూకూ ఏంటి...

ఆ ఊర్లో ఒకర్నొకరు విజిలేసుకుని పిలుచుకుంటారు.. వింతగా ఉన్నా అదే నిజం .కావాలంటే మీరే చూడండి.-People Of This Meghalaya Village Use Unique Tunes Instead Of Names

నాకొక పేరుంది అలా పిలువు.లేదు నేనిలాగే పిలుస్తా పలుకుతావా లేదా.ఏంటి పిచ్చిపిచ్చిగా ఉందా…బాబ్బాబూ కోపం వద్దు.నిన్ను నీపేరుతోనే పిలుస్తా కానీ… మనదేశంలో ఒక ఊరుంది.ఆ ఊర్లో పిల్లలకు పేర్లున్నాయి.కానీ పేర్లతో పిలుచుకోరు.మరెలా పిలుచుకుంటారు.

ఇలాగే కుకూకుకూకూ… కికికికీకీ… నమ్మట్లేదా…కావాలంటే చదవండి…

ఈ లోకంలో ఉన్నన్ని వింతలు విడ్డూరాలు ఎక్కడా ఉండవేమో.అందులోనూ మనదేశంలో అయితే అడుగుకో వింత .

వాటిల్లో కొన్ని నవ్విస్తే.మరికొన్ని ఇదేం పిచ్చిరా అనిపిస్తుంటాయి. మేఘాలయలోని కొంగోతోంగ్ గ్రామంలో ఒకర్నొకరు పిలుచుకోవాలంటే విజిల్ వేసి పిలుచుకుంటారు...

మన దగ్గర ఒకర్నిచూసి విజిల్ వేసి మన తాటతీస్తారు.కానీ అక్కడ మాత్రం తల్లి తన కొడుకును ఈలేసే పిలుస్తుంది.

తండ్రి తన కూతురిని ఈలేసే పిలుస్తాడు. అది వాళ్ల సంప్రదాయం.ఈలంటే ఈలకాదు.

రాగం తీసి మరీ వేస్తారు. ఎందుకంటే వాళ్ల ఆచారం ప్రకారం జనాన్ని వారు పేర్లతో పిలవ కూడదు …

పుట్టిన ప్రతి బిడ్డకు తల్లి ఒక ఈల ట్యూన్ ఉంటుంది. ఆ బిడ్డను ఈ ట్యూన్‌తోనే పిలుస్తుంది. పిల్లలకు థాంగ్ పీ, కాషీ అనే నానా పేర్లు కూడా ఉంటాయి కానీ పిలవడం మాత్రం ఈలతోనే. పిల్లలు కూడా దానికి అలవాటు పడిపోతారు.

చుట్టుపక్కలున్నవారూ అంతే. ఆ ట్యూన్‌తోనే పిలుస్తారు. పిలుపు ఏకంగా అరనిమిషం పాటు సాగుతుంది...

ఒకసారిగాని ట్యూన్ కట్టేస్తే చనిపోయేంత వరకు దానికి బదులివ్వాల్సిందే.ఎలా పిలుస్తారో వీడియోలో మీరే చూడండి.

ఈ వీడియో కోసం క్లిక్ చేయండి.