ప్రేక్షకుల ముందుకు పవన్‌ అల్లుడి మూవీ.. ఎన్నికలకు ముందు అభిమానులకు కానుక  

  • ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత పవన్‌ పూర్తిగా రాజకీయాల్లోకి షిప్ట్‌ అయ్యాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన పవన్‌ 25వ చిత్రం అజ్ఞాతవాసి అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. సినిమా ఫలితం తేలిపోయిన వెంటనే క్రియాశీలక రాజకీయాలతో బిజీ అయ్యాడు. ఈ సమయంలోనే పవన్‌ నిర్మాతగా మాత్రం అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నాడు. ఈమద్య తన అభిమాని నితిన్‌ హీరోగా నటించిన 25వ చిత్రం ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఇప్పుడు మరో సినిమాకు పవన్‌ సిద్దం అవుతున్నట్లుగా మెగా వర్గాల నుండి విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

  • Pawan Kalyan To Produce Vaishnav Tej Movie-

    Pawan Kalyan To Produce Vaishnav Tej Movie

  • పవన్‌ కళ్యాణ్‌ మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకుని, మాస్‌ ఆడియన్స్‌ను అరిస్తూ వస్తున్నాడు. తాజాగా మరో మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. గత సంవత్సర కాలంగా వైష్ణవ్‌ నటన మరియు డాన్స్‌ల్లో ప్రావిణ్యం పొందేందుకు కఠోర శిక్షణ తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే పలు కథలు విన్న వైష్ణవ్‌ తాజాగా ఒక సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఆ సినిమాను ‘నేలటికెట్‌’ చిత్రాన్ని నిర్మించిన రామ్‌ తాళ్లూరి నిర్మించబోతున్నాడు.

  • Pawan Kalyan To Produce Vaishnav Tej Movie-
  • గత కొంత కాలంగా పవన్‌కు ఆర్థికంగా వెన్ను దన్నుగా నిలుస్తున్న వ్యక్తి రామ్‌ తాళ్లూరి అంటూ మీడియాలో ప్రచారం జరుగుతుంది. జనసేన పార్టీ తరపున టికెట్‌ను ఆశిస్తున్న రామ్‌ తాళ్లూరి తాజాగా పవన్‌ను వైష్ణవ్‌ తేజ్‌ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం చేసినట్లుగా తెలుస్తోంది. పెట్టుబడి పెట్టకుండానే కేవలం తనకున్న క్రేజ్‌ను పవన్‌ పెట్టుబడి పెడితే చాలు. పవన్‌ ఈ చిత్రంతో మంచి లాభాలను దక్కించుకునే అవకాశం ఉంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

  • పవన్‌ కళ్యాణ్‌ ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రంలో కూడా పెట్టుబడి పెట్టకుండానే నిర్మాత అయ్యాడు. తాజాగా ఈ చిత్రంతో కూడా అదే పరిస్థితి అంటూ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వైష్ణవ్‌తేజ్‌ మొదటి సినిమాకు పవన్‌ నిర్మాత అంటూ ప్రచారం జరగడంతో మంచి పబ్లిసిటీ దక్కే అవకాశం ఉంది. ఇదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌కు రాబోయే ఎన్నికల్లో ఫండ్‌కు కొద్దిగొప్ప కష్టం తీరబోతుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో వచ్చేలా వైష్ణవ్‌ తేజ్‌ మూవీని ప్లాన్‌ చేస్తున్నారు.