ఆపరేషన్ గరుడ ... బాబు రగడ ! ఇదేనా  

Operation Garuda Planning In Telangana Tdp-

జాతీయ స్థాయిలో చంద్రబాబు వల్ల బీజేపీకి ఇబ్బంది ఉందన్న కారణంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద కేంద్రం కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని. దానిలో భాగంగానే ఆపరేషన్ గరుడ అనే పధకం ద్వారా బాబు ని ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోందని గత కొంత కాలంగా టీడీపీ నేతలు అనుమానిస్తూ వస్తున్నారు...

ఆపరేషన్ గరుడ ... బాబు రగడ ! ఇదేనా -Operation Garuda Planning In Telangana TDP

అయితే ఈ ఆపరేషన్ గరుడ కథ క్లైమాక్స్ కి వచ్చిందని. దీనికి సంబంధించి బాబు కు త్వరలోనే నోటీసులు కూడా అందుతాయని సినీ నటుడు శివాజీ కూడా కొద్దీ రోజుల క్రితం మీడియా ముందు చెప్పాడు.

అన్నట్టుగానే బాబుకి బాబ్లీ కేసుకు సంబంధించి కోర్టు నోటీసులు కూడా అందాయి.

ఎనిమిదేళ్ల నాటి కేసును తిరగదోడటమంటే దీని వెనక కేంద్ర పెద్దలు ఉన్నారని టీడీపీ అనుమానిస్తోంది. మహారాష్ట్ర కోర్టు చంద్రబాబుతో పాటుగా మరికొందరికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ అప్పట్లో బాబ్లీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఇప్పుడు ఈ కేసు తిరగదోడి నాన్ బెయిల్ బుల్ వారెంట్ చేస్తారా? అని టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఆరోజు కేసును ఉపసంహరిచుకుంటున్నామని మహారాష్ట్ర పోలీసులు చెప్పారని, అయితే మళ్లీ తిరగదోడటంలో ఆంతర్యమేంటని ఏపీ మంత్రి నక్కా ఆనంద బాబు ప్రశ్నిస్తున్నారు...

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నోటీసులను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయానికి వచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ప్రయోజనాల కోసం తాము ఆనాడు ఉద్యమిస్తే తమకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయాన్ని తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఒక వైపు కేంద్రం తమను ఇబ్బంది పెట్టాలని పాత కేసులను బయటకి తిరగ తోడి ఇలా చేస్తోందని చెప్తూనే .

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రచారం చేసి ప్రజల్లో సానుభూతి ఓట్లు కొట్టేయాలని టీడీపీ ఆలోచన. ఇలా చేయడం వలన రెండురకాల ప్రయోజనం పొందేలా టీడీపీ ప్లాన్ వేస్తోంది...

అయితే కేంద్రం టీడీపీ ని ఇబ్బంది పెట్టాలంటే ఇంకా అనేక రకాల ఆప్షన్స్ కేంద్రం వద్ద ఉన్నాయి.