గోవింద డేట్‌ ఫిక్స్‌ చేశాడు.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు  

Ntr Fans Troll Vijay Devarakonda Nota Release Date-

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘నోటా’ చిత్రం విడుదల తేదీ ఫిక్స్‌ అయ్యింది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం విడుదల తేదీ గురించి గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. మొదట ఈ చిత్రంను అక్టోబర్‌ 4న విడుదల చేయాలని భావించారు. అయితే నోటా వచ్చిన వారం రోజుల్లోనే అరవింద సమేత రావడం వల్ల నష్టం వాటిల్లనుందని చిత్ర యూనిట్‌ సభ్యులు భావించి అరవింద సమేత చిత్రం విడుదలైన తర్వాత నోటాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు...

గోవింద డేట్‌ ఫిక్స్‌ చేశాడు.. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు-Ntr Fans Troll Vijay Devarakonda Nota Release Date

కాని నోటా విడుదలైన తర్వాత తెలుగు మరియు తమిళంలో పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి.

‘నోటా’ విడుదల తేదీ విషయంలో తాజాగా విజయ్‌ దేవరకొండ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ చిత్రాన్ని ఎక్కువ శాతం కోరుకున్నట్లుగా అక్టోబర్‌ 5న విడుదల చేయాలని ఫిక్స్‌ అయినట్లుగా ప్రకటించాడు. అక్టోబర్‌ 5న విడుదల తేదీతో పోస్టర్‌ను కూడా పోస్ట్‌ చేశాడు. అయితే ఈ విషయమై ఎన్టీఆర్‌ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ‘నోటా’ చిత్రం విడుదలైన వారం రోజు తర్వాత ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ చిత్రం విడుదల కాబోతుంది.

‘నోటా’ సినిమా యావరేజ్‌గా ఉంటే పర్వాలేదు. కాని మంచి సక్సెస్‌ను దక్కించుకుంటే మాత్రం ‘అరవింద సమేత’ చిత్రం కలెక్షన్స్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. దాంతో నందమూరి ఫ్యాన్స్‌ కాస్త ఆగ్రహంతో ఉన్నారు..

ఎన్టీఆర్‌ చిత్రాన్ని ఢీ కొట్టాలనే ఉద్దేశ్యంతోనే విజయ్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని, గీత గోవిందం చిత్రం సక్సెస్‌ అవ్వడంతో ఆయన తల పొగరు పెరిగిందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విజయ్‌ దేవరకొండపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ‘నోటా’ చిత్రం తమిళం మరియు తెలుగులో ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో అని ప్రస్తుతం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘నోటా’ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

లాంగ్‌ రన్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడాలి.