ఎన్టీఆర్‌తో సున్నం పెట్టుకుంటున్న వర్మ.. ఫ్యాన్స్‌ ఆగ్రహం  

Ntr Fans Angry Ram Gopal Varma-

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు, ఏం చేసినా కూడా సంచలనానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈమద్య కాలంలో సినిమాలు తెరకెక్కించడంపై కన్నా ఎక్కువగా వివాదాలను క్రియేట్‌ చేయడంలోనే ఈయన ఎక్కువ దృష్టిని పెడుతున్నాడు. అందుకే వర్మ దర్శకత్వంలో ఈమద్య కాలంలో వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేక పోతున్నాయి...

ఎన్టీఆర్‌తో సున్నం పెట్టుకుంటున్న వర్మ.. ఫ్యాన్స్‌ ఆగ్రహం-NTR Fans Angry Ram Gopal Varma

దాదాపు దశాబ్ద కాలంగా వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్లాప్‌ అవుతూనే ఉన్నాయి. దాంతో దర్శకత్వ బాధ్యతలను పక్కకు పెట్టి నిర్మాతగా అవతారం ఎత్తుతున్నాడు.

తాజాగా వర్మ కంపెనీలో తెలుగు మరియు కన్నడ భాషల్లో ‘భైరవగీత’ అనే ద్విభాష చిత్రం తెరకెక్కింది. ఇటీవలే ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రానికి కాస్త అటుఇటుగా ఉన్న ఈ చిత్రంలో ముద్దు సీన్స్‌ హద్దు పద్దు లేకుండా ఉంటాయని ట్రైలర్‌ చూస్తుంటేనే అనిపిస్తుంది. సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం విడుదల తేదీని వర్మ ప్రకటించి, అందరు ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ చిత్రంను దసరా కానుకగా విడుదల చేయబోతున్నాడు..

వర్మ శిష్యుడు తెరకెక్కించిన ‘భైరవగీత’ చిత్రంను అక్టోబర్‌ 11న విడుదల చేయాలని భావిస్తున్నారు. అదే రోజు ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబో మూవీ ‘అరవింద సమేత’ విడుదలకు సిద్దం అవుతుంది.

ఎన్టీఆర్‌ చాలా కష్టపడి, చాలా అంచనాలు పెట్టుకుని మరీ ఆచిత్రంను చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అరవింద సమేత చిత్రంకు భైరవగీత పెద్దగా పోటీని ఇవ్వలేదు. కాని ఎన్టీఆర్‌ మూవీ కలెక్షన్స్‌పై ప్రభావం అయితే చూపిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది...

భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఎన్టీఆర్‌ అరవింద సమేత చిత్రంకు పోటీగా తమ చిత్రం విడుదల కాబోతున్నట్లుగా వర్మ ప్రకటించిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ అభిమానులు తీవ్రమైన ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు. వర్మ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద సినిమాలకు పోటీగా విడుదల చేయడం అనేది కేవలం పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే అంటూ వర్మ తీరును తప్పుబడుతున్నారు.