అమెరికాలో అక్షరమాల..!!!  

Nris Aksharamala Program In America-nri,nris Aksharamala

మారుతున్న టెక్నాలజీ లో ఎక్కడ తెలుగు భవిష్యత్తు తరాలకి అందకుండా పోతుందో అనే భయంతో ఎంతో మంది ప్రత్యేకంగా తమ పిల్లలకి తెలుగు నేర్పిస్తూ ఉంటారు. అయితే విదేశాలు వెళ్ళినా సరే అక్కడ తమ పిల్లలు తెలుగు ఎక్కడ మాట్లాడకుండా ఉంటారో అనే భయంతో ఎంతో మంది తల్లి తండ్రులు విదేశాలలో తెలుగు నేర్పిస్తూ ఉంటారు.

NRIs Aksharamala Program In America-Nri Nris

NRIs Aksharamala Program In America

ఈ క్రమంలోనే భవిష్యత్తు తరాలు తెలుగు నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో సెంట్రల్‌ ఒహాయో తెలుగు సంఘం కొలంబస్‌, ఒహాయో లో ప్రతి సంవత్సరం నిర్వహించే తెలుగు పండగ అక్షరమాల కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించింది. టాకో అధ్యక్షులు ఫణి బూషణ్ అధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో కధలు, కవితలు, వ్రాత పోటీలు , ఏకపాత్రాభినయం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

గురుకుల్‌, మనబడి లాంటి తెలుగు బడులకు చెందిన విద్యార్ధులు కూడా ఎంతో ఉశ్చాహంగా పాల్గొన్నారు. విజేతలుగా గెలుపొందిన వారందరికీ మే 11 న జరిగే టాకో ఉగాది వేడుకల్లో బహుమతులు అందిస్తారని సంస్థ సభ్యులు తెలిపారు.