జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తింటే ఇంత డేంజరా ..?  

  • జ్వరం వచ్చిన చాలా మందికి తలెత్తే ఒక సందేహమే ఇది. జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం తినవచ్చా? చికెన్‌, మటన్‌, చేపలు, కోడిగుడ్లు వంటి నాన్ వెజ్ వంటకాలను తినకూడదా ? తింటే ఏమవుతుంది? అనే సందేహం చాలా మందికి వస్తుంది. అయితే కొందరు తింటారు, ఇంకొందరు భయానికి తినరు. అయితే అసలు జ్వరం వచ్చినప్పుడు నాన్‌వెజ్ తింటే ఏమవుతుంది? పచ్చ కామెర్లు వస్తాయని చాలా మంది అంటారు. మరి ఇందులో నిజమెంత? ఇప్పుడు తెలుసుకుందాం.

  • Nonveg Eat For Coming Fever What Is The Danger-

    Nonveg Eat For Coming Fever What Is The Danger

  • సాధారణంగా ఎవరికైనా జ్వరం వస్తే జీర్ణశక్తి బాగా తగ్గిపోతుంది. దీంతో డాక్టర్లు తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోమంటారు. అలాంటప్పుడు సరిగ్గా జీర్ణం కాని మాంసాహారం తింటే దాంతో లివర్‌పై లోడ్ ఎక్కువగా పెరిగిపోతుంది. దీంతో లివర్ పనితీరు మందగిస్తుంది.అలాంటప్పుడు పచ్చకామెర్లు వస్తాయి. కనుక జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం అస్సలు తినరాదు. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తింటే మంచిది.అయితే నిజానికి జ్వరంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినడం వల్ల మాత్రమే కాదు, పలు ఇతర కారణాల వల్ల, అంటే జ్వరం లేకపోయినప్పటికీ కొందరికి పచ్చ కామెర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

  • Nonveg Eat For Coming Fever What Is The Danger-
  • అది ఎలా అంటే. ఎక్కువగా హోటల్స్‌లో భోజనం చేసే వారు, బయట దొరికే ఆయిల్ ఫుడ్స్‌, చిరు తిండ్లు తినేవారికి, ఇంట్లో అయినా ఆయిల్ ఫుడ్స్‌, నాన్ వెజ్ వంటకాలు బాగా తినే వారికి, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారికి పచ్చకామెర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బాగా మద్యం సేవించే వారికి కూడా పచ్చ కామెర్లు రావచ్చు. ఎందుకంటే ఈ పనులు చేస్తే లివర్ గందరగోళానికి గురవుతుంది. దీంతో లివర్ పనితీరు మందగించి కామెర్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.