సోనాలి బింద్రే చ‌చ్చిపోయిందని ట్వీట్..ఎమ్మెల్యే రామ్ క‌ద‌మ్‌ పై మండిపడుతున్న నెటిజెన్స్..అసలేమైంది.  

  • సోనాలి బింద్రే క్యాన్స‌ర్ తో బాధ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ భామ ఇప్పుడు న్యూయార్క్‌లో ఉంది. అక్క‌డే కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటుంది. ప్ర‌స్తుతానికి ఈమె మూడు ద‌శల ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంది. ప్ర‌స్తుతానికి సోనాలి ఆరోగ్యం కుదుట‌ప‌డింది. ఈ మ‌ధ్యే ఫోటోలు కూడా షేర్ చేసి త‌న‌కు ఆప‌రేష‌న్ జ‌రిగింద‌ని త్వ‌ర‌లోనే అంతా బాగుంటుంద‌ని అభిమానుల‌కు చెప్పింది కూడా.

  • Netizens Fires On MLA Ram Kadam Tweet Sonali Bendre-

    Netizens Fires On MLA Ram Kadam Tweet On Sonali Bendre

  • అయితే బాలీవుడ్‌ హీరోయిన్‌ సొనాలీ బింద్రే మరణించారంటూ ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోషల్‌ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. ‘ హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన తార తన నటనతో ప్రేక్షకులను రంజింపచేసిన అభినేత్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆమెకు శ్రద్ధాంజలి’ అంటూ రామ్‌ కదమ్‌ ట్వీట్‌ చేశారు.

  • Netizens Fires On MLA Ram Kadam Tweet Sonali Bendre-
  • సొనాలి బింద్రే మరణ వార్తపై అభిమానులు ఆందోళన చెందారు. ఫేక్ న్యూస్ అని తేలడంతో నెటిజెన్స్ రామ్ కదమ్‌ను ట్రోల్స్ చీల్చి చెండాడారు. దాంతో అసలు విషయం తెలుసుకొన్న రామ్ కదమ్ తన తప్పుకు క్షమాపణ చెప్పారు. ఆయన తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. బాధ్య‌తాయుత‌మైన స్థానంలో ఉండి అస‌లు నిజం ఏంటో తెలుసుకోకుండా క‌నీసం తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌కుండా ఇలా ఓ సెలెబ్రెటీ ఆరోగ్యంతో ఆడుకోవ‌డం అనేది చిన్న విష‌యం కాదు. అందుకే ఇప్పుడు రామ్ క‌ద‌మ్‌పై సోష‌ల్ మీడియాలో కూడా విమ‌ర్శ‌లు భారీగా వ‌స్తున్నాయి. ఇది త‌ప్ప‌ని తెలుసుకుని వెంట‌నే తేరుకుని సోనాలి ఆరోగ్యం కోసం దేవున్ని ప్రార్థిస్తున్నానంటూ మ‌రో ట్వీట్ చేసారు ఈయ‌న‌.