నాటకం కూడా అర్జున్‌ రెడ్డి బాటలోనే.. తెలుగు సినిమా ముద్దుల్లో మునిగి పోతోంది  

Natakam Movie Teaser Goes Viral-

Once kisses are just limited to Hollywood and Bollywood movies. Appa Padappa Appeared in Telugu Cinema. But now kisses in Telugu cinema are very common. Arjun Reddy came out of the film and kissed the scene. The film is a huge fan of the movie. There is no doubt that Arjun Reddy has succeeded because of the kiss scenes. The subsequent Rox 100 movie was also hit by a hundred percent kisses. Geeta Govindam and Verma are producing Bhairawagita and kissed all the films in this film.

.

The 'drama' is the latest film that draws the attention of everyone. It seems to be a full-fledged movie that has been watching a trailer in a whole rural season. Hero appears in full mass character. It looks like the hero in the mold ARX 100 is like a hero. In the same way, the heroine kissed the heroine and kissed her with kisses. These films are coming to Telugu Youth Audience. That is why the film has been done in the same background. Short films should definitely succeed. Only those films that have kisses in the small films of this period have succeeded. The films that are screened with huge budgets do not show interest in kissing scenes. Directors of small films are trying to overwhelm the audience with kisses.

ఒకప్పుడు ముద్దు సీన్స్‌ అంటే కేవలం హాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాలకే పరిమితం అయ్యేవి. అడపా దడపా తెలుగు సినిమాల్లో కనిపిస్తే అబ్బో అనుకునేవారు. కాని ఇప్పుడు తెలుగు సినిమాల్లో ముద్దు సీన్స్‌ అనేవి చాలా కామన్‌ అయ్యాయి..

నాటకం కూడా అర్జున్‌ రెడ్డి బాటలోనే.. తెలుగు సినిమా ముద్దుల్లో మునిగి పోతోంది-Natakam Movie Teaser Goes Viral

ఆమద్య వచ్చిన అర్జున్‌ రెడ్డి చిత్రంలో ఏకంగా ముద్దు సీన్స్‌ వర్షం కురిసింది. ఈతరం ప్రేక్షకులకు ఆ సినిమా విపరీతంగా నచ్చేసింది. ముద్దు సీన్స్‌ కారణంగానే అర్జున్‌ రెడ్డి సక్సెస్‌ అయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆ తర్వాత వచ్చిన ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం కూడా నూరు శాతం ముద్దు సీన్స్‌ కారణంగానే విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత గీత గోవిందం, వర్మ నిర్మిస్తున్న భైరవగీత ఇలా అన్ని సినిమాల్లో కూడా ముద్దులతో ముంచెత్తారు.

తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘నాటకం’. పూర్తిగా పల్లెటూరి కాలంలో, కాస్త వెనకటి తరంలో తెరకెక్కిన చిత్రంగా ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. హీరో పూర్తి మాస్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు.

అచ్చు అర్‌ఎక్స్‌ 100 చిత్రంలో హీరో మాదిరిగానే క్యారెక్టరైజేషన్‌ ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ చిత్రంలో మాదిరిగానే హీరోయిన్‌తో మోటు రొమాన్స్‌ చేయడంతో పాటు, ముద్దులతో హీరో ముంచెత్తాడు. తెలుగు యూత్‌ ఆడియన్స్‌కు ఈమద్య ఇలాంటి చిత్రాలు ఎక్కుతున్నాయి. అందుకే మరోసారి అదే నేపథ్యంలో సినిమాను చేయడం జరిగింది..

తెలుగులో చిన్న చిత్రాల జోరు కొనసాగుతుంది. చిన్న చిత్రాలు సక్సెస్‌ అవ్వాలి అంటే ఖచ్చితంగా ముద్దు సీన్స్‌ ఉండాల్సిందే. ఈమద్య కాలంలో వచ్చిన చిన్న చిత్రాల్లో ముద్దు సీన్స్‌ ఉన్న సినిమాలు మాత్రమే సక్సెస్‌లు దక్కించుకున్నాయి.

భారీ ఎత్తున బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు మాత్రం ముద్దు సీన్స్‌ జోలికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. చిన్న చిత్రాల దర్శకులు మాత్రమే ముద్దులతో ప్రేక్షకులను ముంచెత్తాలని ప్రయత్నాలు చేస్తున్నారు.