నమ్మిన వారిపైనే నిఘా .. లోకేష్ మామూలోడు కాదు  

Nara Lokesh Want To Phone Tamparin On Own Party Members-

తాను నీడను కూడా నమ్మకపోవడం ఏపీ సీఎం చంద్రబాబు నైజం. ఇది పార్టీలో అందరికి తెలిసిన నిజం. తాను చుట్టూ అత్యంత నమ్మకస్తులుగా పేరున్న కొంతమంది నాయకులతో సహా ఎవరిని నమ్మాడు బాబు...

నమ్మిన వారిపైనే నిఘా .. లోకేష్ మామూలోడు కాదు -Nara Lokesh Want To Phone Tamparin On Own Party Members

ఎందుకంటే కీడు ఎంచి మేలు ఎంచాలన్న సూత్రంతో బాబు మైండ్ సెట్ పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే మైండ్ సెట్ ని వారసత్వంగా తీసుకున్నాడో ఏమో తెలియదు కానీ చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా అదే మైండ్ సెట్ తో ఉన్నాడు అనేదానికి తాజాగా ఒక సంఘటన ఉదాహరణగా కనిపిస్తోంది.

ఇటీవల పార్టీ పనుల నిమిత్తం కొంతమంది వ్యక్తులను ఆయా నియోజకవర్గాల్లో నియమించాడు లోకేష్. అయితే వారిపై పూర్తిగా నమ్మకం కలగలేదో ఏమో తెలియదు కానీ తాను నియమించిన వారి పై తనే నిఘాను ఉంచాడట.

ఇటీవలి కాలంలో నారా లోకేష్ నియమించుకున్న నియోజకవర్గ స్థాయి ఇన్ఫర్మేషన్ సెంటర్లలో పని చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సెంటర్లలో నియమితం అయిన వాళ్లు టీడీపీ కి అత్యంత ఆప్తులు. అలాంటివారిని లోకేష్ ఫిల్టర్ చేసి మరీ ఎంపిక చేసాడు..

అది కూడా తన సామాజికవర్గం వారికే పెద్దపీట వేసి మరీ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంత వడపోసి బాగా కావాల్సిన వాళ్లను ఎంపిక చేసుకున్నా. వీరిపై నిఘాను ఉంచినట్టుగా ప్రచారం జరుగుతోంది. లోకేష్ తన కు కావాల్సిన సమాచారం కోసం, తన వ్యూహాలను అమల్లో పెట్టడానికి ఏర్పాటు చేసుకున్న ఈ సెంటర్లలో పని చేసే వాళ్లు వైసీపీకి ఏమైనా సమాచారం లీక్ చేస్తున్నారా అనే భయంతో వారి ఫోన్ లపై పూర్తిగా నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.

వారు వైసీపీ నాయకులతో ఏమైనా టచ్లో ఉన్నారా? అనే అంశాల గురించి నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. అందుకే వారి ఫోన్ లకు ఏమేమి మెసేజ్‌లు వస్తున్నాయి, వీళ్లు ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్టు సమాచారం.

ఎవరైనా పొరపాటున వైసీపీ కార్యకర్తలుగా పేరున్న వారితోనో. బయటి వాళ్లతోనే ఏవైనా రాజకీయ అంశాల గురించి చర్చిస్తే ఇక అక్కడ నుంచి వారికి వేధింపులు మొదలవుతున్నాయని తెలుస్తోంది...

ఇదంతా బయటకి చెప్పుకోలేక వారు లోలోపల కుమిలిపోతున్నట్టు సమాచారం.