చివరకు బిగ్‌బాస్‌, నానిలు కూడా సేఫ్‌ గేమ్‌కు సిద్దం అయ్యారు  

Nani And Bigg Boss Playing Safe Game-

Big bass Season 2 reached the final week of controversy and clash. The final winner will be floated by this Sunday. It's all about the curiosity. Everything except the Kaushal feels like a safe game playing here. But Kaushal is talking to him as he says. That's why Kaushal has an exceptionally huge fan following on social media.

.

The big bass hosted along with the big bass hostesses to the tales of the Kaushal Army in the social media, the bass organizers also started a safe game. That is why Kaushal is not watching Target, without having to go back with Kaushal. Nani's last Saturday and Sunday episodes can be understood by how careful he is in Kaushal. Even though the dogs were members of the family, Kaushal was not reacting much. The reason Kaushal Army is to tell everyone .

The Kaushal Army is not the big boss fair game on social media in the past, and the trend that Nanny will not work as a host. I do not know what the trends have gone. It is trended in the top of India wide. Then the Telugu Big Boss has gone through. That's why Big Boss organizers and Nani Kaushal have started the Safe Game .. Clarity on the winner in the next five days. Why was he not making any controversy about why he wanted to create controversies at this time? Season 2 is the winner of the season, while the Kaushal Army is kindly promoted as a Kaushal winner. The winner of the big boss with the Sunday episode will float.

వివాదాలు, గొడవల మద్య సాగిన బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ఫైనల్‌ వారంకు చేరింది. ఈ ఆదివారంతో ఫైనల్‌ విజేత ఎవరో తేలిపోనుంది. అందరి దృష్టి కౌశల్‌పైనే ఉన్న విషయం తెల్సిందే. కౌశల్‌ మినహా మిగిలిన అంతా కూడా సేఫ్‌ గేమ్‌ ఆడుతూ ఇక్కడి వరకు వచ్చినట్లుగా అనిపిస్తుంది...

చివరకు బిగ్‌బాస్‌, నానిలు కూడా సేఫ్‌ గేమ్‌కు సిద్దం అయ్యారు-Nani And Bigg Boss Playing Safe Game

అయితే కౌశల్‌ మాత్రం ఆయనకు తోచిన విధంగా మాట్లాడుతూ ఆడుతున్నాడు. అందుకే కౌశల్‌కు సోషల్‌ మీడియాలో అనూహ్యంగా భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ దక్కింది.

సోషల్‌ మీడియాలో కౌశల్‌ ఆర్మీ చేస్తున్న కామెంట్స్‌కు, పోస్ట్‌లకు, ట్రోల్స్‌కు బిగ్‌ బాస్‌ హోస్ట్‌ నానితో పాటు బిగ్‌ బాస్‌ నిర్వాహకులు కూడా ఒకవిధమైన సేఫ్‌ గేమ్‌ను మొదలు పెట్టారు. అంటే కౌశల్‌ను టార్గెట్‌ చేయకుండా, కౌశల్‌తో పదే పదే గొడవ లేకుండా చూస్తున్నారు.

నాని గత శని, ఆదివారాల ఎపిసోడ్‌లను చూస్తే కౌశల్‌ విషయంలో ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాడో అర్థం చేసుకోవచ్చు. ఇంటి సభ్యులను కుక్కలు అంటూ తిట్టినా కూడా కౌశల్‌పై పెద్దగా రియాక్ట్‌ కాలేదు. కారణం కౌశల్‌ ఆర్మీ అనే విషయం అందరికి తెల్సిందే..

కౌశల్‌ ఆర్మీ గతంలో పలు సార్లు సోషల్‌ మీడియాలో బిగ్‌ బాస్‌ ఫెయిర్‌ గేమ్‌ కాదు, నాని హోస్ట్‌గా పనికి రాడు అంటూ ట్రెండ్‌ చేసిన విషయం తెల్సిందే. ఆ ట్రెండ్స్‌ ఏ స్థాయిలో వెళ్లాయో చెప్పనక్కర్లేదు. ఇండియా వైడ్‌గా టాప్‌లో ఆ విషయం ట్రెండ్‌ అయ్యింది. దాంతో తెలుగు బిగ్‌ బాస్‌ పరువు పోయింది.

అందుకే బిగ్‌ బాస్‌ నిర్వాహకులు మరియు నాని కౌశల్‌ విషయంలో సేఫ్‌ గేమ్‌ను మొదలు పెట్టారు...

మరో అయిదు రోజుల్లో విజేతపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వివాదాలను సృష్టించడం ఎందుకు అనుకున్న నాని ఆయనపై ఎలాంటి కామెంట్స్‌ చేయకుండా వదిలేశాడు.

ఇక సీజన్‌ 2 విజేత ఎవరు అయ్యి ఉంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, కౌశల్‌ ఆర్మీ దయతో కౌశల్‌ విజేతగా నిలవడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతుంది. ఆదివారం ఎపిసోడ్‌తో బిగ్‌ బాస్‌ విజేత ఎవరో తేలిపోనుంది.