గీత మాధురిపై కామెంట్స్‌ను తట్టుకోలేక పోతున్న నందు ఏం చేశాడో తెలుసా..  

Nandu Comments On Who Was Comments Geetha Madhuri In Bigg Boss House-

Bigboss Telugu Season 2 will soon be completed. There have been criticisms from the beginning of this time. Biggas is going ahead with the criticism. In the case of celebrities, the lip crackers are initially responding to each member of the house. First of all, Gita Madhuri is big plus to Biggas and she is sure that she will be in the final. Everything seems to be her until the final. But the criticism of the audience is coming at a level.

.

Geeta Madhuri is not playing the original game in Bigbaas, she is angry with the riot that she does not play seriously. At the same time, she has been criticizing Kaushal for nominating herself for the entire season. She feels angry about her husband following a massive criticism. Geeta resentes Madhuri who is indifferent to those who are personally criticized. . Geeta Madhuri forgets what she is playing in a game show, forgetting that she is playing a game and it is not good for her to personally criticize her, and some of the decisions she may have taken part of the game may hurt some. But she should know that she is not personally taken. Everyone has the power to say opinions about Bigbass. But he posted a video message on social media, saying that making Target was not just a matter of criticism. .

. In the video message, the audience started to troll a large scale. Soon the video was deleted. That video did not make it visible. The information will be discarded as the trolls are on the rise. The Kaushal Army has deleted the video in the view that it is more likely to target the song. .

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 అతి త్వరలోనే పూర్తి కాబోతుంది. ఈ సారి ఆరంభం నుండి కూడా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆ విమర్శలను ఎదుర్కొంటూనే బిగ్‌బాస్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నారు. సెలబ్రెటీల విషయంలో ఆరంభంలోనే పెదవి విరిచిన ప్రేక్షకులు ఆ తర్వాత ఒక్కొ ఇంటి సభ్యుడిపై ఒక్కో విధంగా స్పందస్తూ వస్తున్నారు...

గీత మాధురిపై కామెంట్స్‌ను తట్టుకోలేక పోతున్న నందు ఏం చేశాడో తెలుసా..-Nandu Comments On Who Was Comments Geetha Madhuri In Bigg Boss House

మొదట బిగ్‌బాస్‌కు గీతా మాధురి చాలా చాలా ప్లస్‌ అవుతుందని, ఆమె తప్పకుండా ఫైనల్‌ వరకు ఉంటుందని అంతా అనుకున్నారు. అంతా అనుకున్నట్లుగా ఫైనల్‌ వరకు ఆమె ఉండే అవకాశం కనిపిస్తుంది. కాని ఆమెపై ప్రేక్షకుల్లో విమర్శలు తారా స్థాయిలో వస్తున్నాయి.

బిగ్‌బాస్‌లో గీత మాధురి అసలు గేమ్‌ ఆడటం లేదని, అల్లరి చిల్లరగా వ్యవహరిస్తూ ఆమె ఏమాత్రం సీరియస్‌గా ఆడటం లేదు అంటూ అంతా ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో ఆమె కౌశల్‌ను సీజన్‌ మొత్తంకు కూడా ఎలిమినేషన్‌కు నామినేట్‌ చేయడంతో మరింతగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భారీ ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె భర్త నందుకు ఆగ్రహం కలిగినట్లుగా అనిపిస్తుంది. గీతా మాధురిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న వారిపై నందు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

గీతా మాధురి ఒక గేమ్‌ షోలో ఉన్న విషయం మర్చి పోవద్దని, ఆమె గేమ్‌ ఆడుతున్న విషయం మర్చి పోయి కొందరు ఆమెను వ్యక్తిగతంగా విమర్శించడం ఏమాత్రం బాగాలేదని, ఆటలో భాగంగా కొన్ని సార్లు ఆమె తీసుకునే నిర్ణయాలు కొందరిని బాధ పెట్టి ఉండవచ్చు. కాని ఆమె అది వ్యక్తిగతంగా తీసుకున్నది కాదు అనే విషయంను తెలుసుకోవాలి. బిగ్‌బాస్‌ గురించిన అభిప్రాయాలు చెప్పే అధికారం అందరికి ఉంటుంది..

కాని ఒక్కరిని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేయడం మాత్రం ఏమాత్రం సమంజసం కాదు అంటూ నందూ ఒక వీడియో సందేశాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

నందు వీడియో సందేశాన్ని కూడా ప్రేక్షకులు పెద్ద ఎత్తున ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. దాంతో వెంటనే నందు ఆ వీడియోను తొలగించేశాడు. ఆ వీడియో అసలు కనిపించకుండా చేశాడు.

ట్రోల్స్‌ పెరుగుతున్న కారణంగానే నందు ఆ వీడియోను తొలగించినట్లుగా సమాచారం అందుతుంది. కౌశల్‌ ఆర్మీ మరింతగా గీతను టార్గెట్‌ చేసే అవకాశం ఉందని భావించిన నందు ఆ వీడియోను డిలీట్‌ చేసేశాడు.