నందమూరి ఫ్యామిలీకి ఆ నెంబర్ లక్కీ..! కానీ ఆ నెంబర్ వారిని కాపాడలేకపోయింది.!  

Nandamuri Family Lucky Number Not Saved Us-

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు. నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు...

నందమూరి ఫ్యామిలీకి ఆ నెంబర్ లక్కీ..! కానీ ఆ నెంబర్ వారిని కాపాడలేకపోయింది.!-Nandamuri Family Lucky Number Not Saved Us

ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఆయన అంతక్రియలు ముగిసాయి.

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

నందమూరి జానకి రాం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ 2014 డిసెంబర్ 6వ తేదీన నల్గొండలోని ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో జానకిరాం మృత్యువాత పడ్డారు..

ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ ఎన్టీఆర్ ప్రాణాలు దక్కాయి.

అప్పట్లో ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరగిన ప్రాంతంలోనే జానకి రామ్ కారు ప్రమాదానికి గురి అయింది. ఇప్పడు హరికృష్ణకు కూడా అదే జిల్లాలో ప్రమాదం జరిగింది. ఈ విషయం నందమూరి అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

ఈ ప్రమాదాల సమయంలో ఎన్టీఆర్, జానకిరాం, హరికృష్ణ వాహనం నడుపుతూ డ్రైవర్ సీట్లో ఉండటం గమనార్హం. మితిమీరిన డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందని అప్పట్లో ఎన్టీఆర్‌పై కేసు నమోదైంది. కాకపోతే సీటు బెల్ట్ కట్టుకోవడంతో ఆయన బతికి బయటపడ్డారు. తాజాగా హరికృష్ణ కూడా గంటకు 160 కిలో మీటర్ల వేగంతో వాహనాన్ని నడుపుతూ ప్రమాదానికి గురయ్యారు.

ఇది ఇలా ఉండగా…ఎన్టీఆర్ ఫ్యామిలీకి లక్కీ నంబర్ 9. ఆ సంఖ్యను చాలా ఇష్టపడుతారు...

కానీ గత రెండు సందర్భాల్లో 9 అంకె వారికి సపోర్టుగా నిలువలేకపోయింది. ఎన్టీఆర్, జానకీరాం, హరికృష్ణ గురైన ప్రమాదంలో జాతీయ రహదారి 9పైనే జరిగింది.