రజినీకాంత్‌ కోసం అనుకున్న పాత్రను నాగ్‌ కు ఇచ్చిన ధనుష్‌.. కారణం ఏంటంటే..!  

Nagarjuna Replaces Rajinikanth In Dhanush\'s Next Directorial Film-

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ అల్లుడు ధనుష్‌ హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే మామ రజినీకాంత్‌తో ‘కాలా’ అనే చిత్రాన్ని నిర్మించి భారీ లాభాలను తన ఖాతాలో వేసుకున్న ధనుష్‌ తాజాగా ఆయనతో కలిసి ఒక చిత్రంలో నటించాలని కోరుకున్నాడు. ఆ చిత్రానికి స్వయంగా తానే దర్శకత్వం వహించేందుకు స్క్రిప్ట్‌ కూడా సిద్దం చేశాడు...

రజినీకాంత్‌ కోసం అనుకున్న పాత్రను నాగ్‌ కు ఇచ్చిన ధనుష్‌.. కారణం ఏంటంటే..!-Nagarjuna Replaces Rajinikanth In Dhanush's Next Directorial Film

100 కోట్ల బడ్జెట్‌తో ఆ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి అయిన నేపథ్యంలో రజినీకాంత్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. పేట చిత్రంకు భారీగా డేట్లు ఇవ్వడంతో పాటు, ఆ తర్వాత రజినీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఉండబోతుంది.

రజినీకాంత్‌ నో చెప్పడంతో ధనుష్‌ తీవ్రంగా నిరుత్సాహం వ్యక్తం చేశాడు. రజినీకాంత్‌ కోసం చాలా పవర్‌ ఫుల్‌ పాత్రను రెడీ చేసుకున్న ధనుష్‌ ఆ పాత్రను నాగార్జునతో చేయించేందుకు సిద్దం అయ్యాడు. సినిమా నుండి రజినీకాంత్‌ తప్పుకున్న కారణంగా బడ్జెట్‌ను 100 నుండి 70 కోట్లకు తగ్గించినట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌ను ఇటీవలే ప్రారంభించారు.

ప్రస్తుతం ధనుష్‌ హీరోగా నటిస్తూ ఈ చిత్రంకు దర్శకత్వం వహిస్తున్నాడు. వరుసగా మధురైలో రెండు నెలల పాటు ఈ చిత్రం చిత్రీకరణ జరుపబోతున్నట్లుగా తెలుస్తోంది..

త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌లో నాగార్జున పాల్గొంటాడు అంటూ తమిళ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ధనుష్‌ మరియు నాగార్జునలతో పాటు ఈ చిత్రంలో మరోస్టార్‌ ఎస్‌ జే సూర్య కూడా కనిపించబోతున్నాడు.

ఈ చిత్రంలో సూర్య విలన్‌గా కనిపించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. తెలుగు మరియు తమిళంలో ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కేవలం తమిళంలో మాత్రమే తెరకెక్కిస్తున్నారు...

తెలుగులో డబ్‌ చేసి విడుదల చేసే అవకాశం ఉంది.

ధనుష్‌ గత చిత్రం సూపర్‌ హిట్‌ అయిన కారణంగా ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ధనుష్‌కు తెలుగులో ఇప్పటి వరకు సరైన ఎంట్రీ దక్కలేదు.

కాని ఈ చిత్రంతో నాగార్జున కారణంగా మంచి ఎంట్రీ దక్కే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. మరో వైపు నాగార్జున, నానితో కలిసి ‘దేవదాస్‌’ అనే మల్టీస్టారర్‌ను చేసిన విషయం తెల్సిందే. ఈ నెలలోనే ఆ చిత్రం విడుదల కాబోతుంది.

దేవదాస్‌ విడుదలైన తర్వాత నాగార్జున తమిళ చిత్రంలో నటించేందుకు మదురై వెళ్లే అవకాశం ఉంది.