అల్లుడికి నాగార్జున ప్యాచ్‌ వర్క్‌.. అక్కినేని అభిమానుల్లో టెన్షన్‌  

Naga Chaitanya Patch Work To Sailaja Reddy Alludu-

నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘శైలజ రెడ్డి అల్లుడు’. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించిన కారణంగా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మారుతి సినిమా అంటే పక్కా ఎంటర్‌టైనర్‌ అంటూ ఈమద్య కాలంలో ఆయన చేసిన సినిమాలు చెప్పకనే చెబుతున్నాయి...

అల్లుడికి నాగార్జున ప్యాచ్‌ వర్క్‌.. అక్కినేని అభిమానుల్లో టెన్షన్‌-Naga Chaitanya Patch Work To Sailaja Reddy Alludu

భారీ ఎత్తున అంచనాలున్న ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రంను ఆగస్టు 31న విడుదల చేయాలని భావించినా కూడా సాధ్యం కాలేదు. దాంతో సెప్టెంబర్‌ 13న విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సినిమా విడుదల ఆలస్యం అయిన కారణంగా నాగార్జున రషెష్‌ చూసి కొన్ని సీన్స్‌కు రీ షూట్‌, కొన్ని సీన్స్‌కు ప్యాచ్‌ వర్క్‌ను సూచించినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల్లో నాగచైతన్య, వెన్నెల కిషోర్‌, రమ్యకృష్ణ, అను ఎమాన్యూల్‌ల కాంబోలో ఆ సీన్స్‌ను చిత్రీకరించారు. రీ షూట్‌ పూర్తి అవ్వడంతో ప్రస్తుతం ఫైనల్‌ వర్షన్‌ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. మారుతి సినిమాలో ఎలాంటి అనవసర సీన్స్‌ ఉండవు.

కాని ఈసారి నాగార్జున చేయి వేసి సీన్స్‌ను రీ షూట్‌ చేయించాడు అంటూ ఎక్కడో అనుమానంగా ఉందని అక్కినేని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

నాగచైతన్య ఇప్పటి వరకు కెరీర్‌లో సోలోగా భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందుకోలేదు. అందుకే ఈ చిత్రంతో అయినా చైతూకు ఆ స్థాయి విజయం దక్కుతుందో చూడాలి. భారీ ఎత్తున అంచనాలున్న శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో రమ్యకృష్ణ పొగరుబోతు అత్తగా కనిపించబోతుంది.

1990లలో పొగరుబోతు అత్తల కథాంశాలతో ఎన్నో చిత్రాలు వచ్చాయి, ఇప్పుడు మళ్లీ అదే రిపీట్‌ చేయబోతున్నాడు...

మారుతి ఈతరం ప్రేక్షకుల అభిరుచి బాగా తెలిసిన దర్శకుడు అందుకే ఈ చిత్రంను చక్కగా తెరకెక్కించి ఉంటాడు అంటూ ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. కాని చైతూ గత చిత్రాల ఫలితంతో కొందరు అభిమానులు మాత్రం టెన్షన్‌కు గురి అవుతున్నారు. ఫలితం ఎలా ఉంటుందో మరికొన్ని రోజుల్లో వెళ్లడి కానుంది.

చైతూతో పాటు అదే రోజు సమంత నటించిన ‘యూటర్న్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండు చిత్రాలు ఇద్దరికి చాలా కీలకం. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.