చైతూ ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు.. ఇప్పటికైనా మేలుకో  

Naga Chaitanya Movies Story Selection-

Even though Akkineni is their family hero, Nagarjuna has not yet hit Solid Commercial. Filming films are a floppy film or not. But one thing is not to say that good commercial hit is not enough. Naga Chaitanya, who has been waiting for commercial success for a long time, has come up with a new film titled 'Shailaja Reddy Alludu'. Everything is going to be a good hit with Maruthi's directorial venture.

.

The film is getting worse in the collections of the film industry as the audience has come up with two weeks ago, 'Sailaja Reddy Alludu' In the Nizam area, the film was sold for nearly 8 crores. But there are just five crores there. It is almost impossible to get the NAGCYTANI's investment in the amount of money it takes to collect five crores. Distributors are saying that this is the same situation in all areas. Such flops are due to the lack of precautions in the selection of Nagachaitanya films, the heroes Nani and Vijay Devarakonda are making films at the box office. At the same time, the viewers do not have to worry about the stereotypes, the old worries and chutneys.

. It is still a matter of time to choose movies and carefully consider the future of the story. A selection of script selection is essential to compete with younger heroes. But the filmmakers say that Akkineni hero Nagachaitanya will not be stuck in the new hero Thoophan.

పేరుకు అక్కినేని వారి ఫ్యామిలీ హీరో అయినా కూడా నాగచైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు సాలిడ్‌ కమర్షియల్‌ హిట్‌ పడినది లేదు. వరుసగా చేస్తున్న సినిమాలు ఒక మోస్తురు చిత్రాలుగా లేదంటే ఫ్లాప్‌లుగా నిలుస్తున్నాయి. కాని ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి కమర్షియల్‌ హిట్‌ దక్కలేదు అని చెప్పక తప్పదు...

చైతూ ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు.. ఇప్పటికైనా మేలుకో-Naga Chaitanya Movies Story Selection

కమర్షియల్‌ సక్సెస్‌ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నాగచైతన్య తాజాగా ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అవ్వడంతో మంచి విజయాన్ని దక్కించుకుంటుందని అంతా భావించారు.

రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్‌ పరంగా తీవ్రంగా నిరాశ పర్చింది అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. నైజాం ఏరియాలో ఈ చిత్రం దాదాపు 8 కోట్లకు అమ్ముడు పోయింది. కాని అక్కడ కేవలం అయిదు కోట్లకు అటు ఇటుగానే వసూళ్లు ఉన్నాయి.

అయిదు కోట్లను వసూళ్లు చేసేందుకు కిందా మీదా పడుతున్న నాగచైతన్య పెట్టిన పెట్టుబడిని రాబట్టడం దాదాపు అసాధ్యం అంటూ అంతా అనుకుంటున్నారు. అన్ని ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి అంటూ డిస్ట్రిబ్యూటర్లు గోడుగోడున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

నాగచైతన్య సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోని కారణంగానే ఇలాంటి ఫ్లాప్‌లు వస్తున్నాయని, తోటి హీరోలు నాని, విజయ్‌ దేవరకొండ వంటి వారు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించే సినిమాలు చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో చైతూ మాత్రం ఇంకా మూస, పాత చింతకాయం పచ్చడి వంటి చిత్రాలు చేస్తున్న కారణంగా ప్రేక్షకులు ఆధరించడం లేదు.

ఇప్పటికి అయినా కాస్త జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకోవాలని, కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. యువ హీరోల పోటీని తట్టుకునేందుకు తగ్గట్లుగా స్క్రిప్ట్‌ ఎంపిక చాలా అవసరం. లేదంటే కొత్త హీరో తుఫాన్‌లో అక్కినేని హీరో నాగచైతన్య కొట్టుకు పోవడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.