నోరు జారడం ఎందుకు.. సారీ చెప్పడం ఎందుకు చైతూ!  

Naga Chaitanya Fires On Review Writers And Says Sorry Too-

అక్కినేని నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. భారీ అంచనాల నడుమ మారుతి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంకు కలెక్షన్స్‌ పాజిటివ్‌గా వచ్చినా కూడా రివ్యూలు మాత్రం నెగటివ్‌గా వచ్చాయి. సినిమా మొదటి రోజే నెగటివ్‌ రివ్యూలు రావడంతో కలెక్షన్స్‌పై ప్రభావం కనిపించింది...

నోరు జారడం ఎందుకు.. సారీ చెప్పడం ఎందుకు చైతూ!-Naga Chaitanya Fires On Review Writers And Says Sorry Too

నెగటివ్‌ రివ్యూలు వచ్చిన నేపథ్యంలో నాగచైతన్య తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఎన్నో అంచనాలు పెట్టుకుని నటించిన చిత్రం పై రివ్యూవర్స్‌ నెగటివ్‌ కామెంట్స్‌ చేయడంతో చైతూ తట్టుకోలేక పోయాడు.

తనకు సన్నిహితంగా ఉండే కొందరి వద్ద రివ్యూవర్స్‌ గురించి తీవ్రమైన కామెట్స్‌ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఆ విషయం కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో నాగచైతన్య తీరుపై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

తన కామెంట్స్‌కు సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వస్తున్న కారణంగా వెంటనే స్పందించి నష్ట నివారణకు సిద్దం అయ్యాడు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన నాగచైతన్య తన వ్యాఖ్యల గురించి క్లారిటీ ఇచ్చాడు. తాను ఎంతో కష్టపడి చేసిన సినిమాకు నెగటివ్‌ రివ్యూలు రావడంతో కాస్త ఇబ్బంది పడ్డాను..

ఆ డిప్రెషన్‌తో కాస్త సీరియస్‌ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. మీడియాలో సినిమాల గురించి పాజిటివ్‌గా వస్తుంటే కొందరు రివ్యూవర్స్‌ మాత్రం తన సినిమా గురించి బ్యాడ్‌గా రాయవడం తనకు బాధగా అనిపించిందని, అందుకే వారిపై కాస్త ఆగ్రహం చేశాను. అందుకు క్షమించాలి అంటూ రివ్యూవర్స్‌కు చైతూ సారీ చెప్పినట్లుగా తెలుస్తోంది. నాగచైతన్య నటన బాగాలేదని రివ్యూవర్స్‌ కామెంట్స్‌ చేసిన కారణంగానే ఆయనకు ఇంతగా కోపం వచ్చినట్లుగా తెలుస్తోంది.

రివ్యూవర్స్‌ను తిట్టడం ఎందుకు ఆ తర్వాత సారీ చెప్పడం ఎందుకు చైతూ అంటూ కొందరు సోషల్‌ మీడియాలోచైతూ గురించి కామెంట్స్‌ చేస్తున్నారు.