ఢిల్లీ ప్లాన్ ఇలా ఉందా .. తెలంగాణాలో మాత్రమే ఎన్నికల హడావుడినా  

  • కేసీఆర్ ముందస్తు తొందరకు ఈసీ కూడా జత కలుస్తోంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణాలో ఎన్నికల నిర్వహణ ఉంటుందని అంతా భావించారు. అందుకే కేసీఆర్ అంత అత్యవసరంగా అసెంబ్లీని రద్దు చేశారని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అసలు తెరవెనుక రాజకీయం బయటకి వస్తోంది. ఆ నాలుగు రాష్ట్రాలకంటే ముందుగానే తెలంగాణాలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికిప్పుడు కుదిరితే రేపే తెలంగాణ ఎన్నికలు పెట్టాలన్నంత ఉత్సాహం ఈసీ కూడా చూపిస్తోంది.

  • Modi Plans On Telangana Elections-

    Modi Plans On Telangana Elections

  • అసెంబ్లీ రద్దు గెజిట్ రాగానే అలా ఈసీ తెలంగాణ అధికారులతో చర్చలు జరిపింది. ఆ తర్వాత నుంచి రోజు రోజుకు శరవేగంగా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి రజత్ కుమార్ ఈ విషయంలో మరింత ఉత్సాహంగా ఉన్నారు. అయిన అసెంబ్లీ రద్దు అయిన రోజే తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనే నోట్‌ను పంపించారు. అప్పుడే ఢిల్లీ ఈసీ కూడా ప్రత్యక్ష పరిశీలన కోసం ఓ టీమ్‌ను పంపాలని డిసైడయింది. పదకొండో తేదీన వారు వస్తారు. మొత్తం చూస్తారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించవచ్చని డిక్లేర్ చేస్తారు.

  • Modi Plans On Telangana Elections-
  • కేసీఆర్ తో పాటు ఈసీ వర్గాలు కూడా ఇంత స్పీడ్ గా స్పందించడానికి కారణం కేంద్రం నుంచి సూచనలు అందడమే కారణం అని తెలుస్తోంది. ఈ కారణంగానే లు ఈసీ ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల విషయంలో లేనంత తొందర. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల కంటే ముందే నిర్వహించి ఫలితాలు వచ్చేలా చూడాలన్నది ఈసీకి అందిన సూచనట. ఎందుకంటేఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే ఆ తర్వాత పోలింగ్ జరిగే నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ సెంటిమెంట్ దెబ్బతింటందనేది ఢిల్లీ పెద్దల ఆలోచనట. అయితే సీన్ రివర్స్ అయ్యి కాంగ్రెస్ కనుక తెలంగాణాలో మెజార్టీ సీట్లు తెచ్చుకుంటే ఏంటి పరిస్థితి ? అప్పుడు ఢిల్లీ ప్లాన్ బెడిసికొట్టినట్టే అవుతుంది కదా.