బాణం నుండి ప్రాణం కాపాడిన స్మార్ట్‌ ఫోన్‌.. తలలోకి దూసుకు పోవాల్సిన బాణం ఫోన్‌లోకి  

Mobile Phone Shields Man From Alleged Bow And Arrow Attack-mobile Phone Shields Man,telugu Viral News,viral In Social Media

ఈమద్య కాలంలో స్మార్ట్‌ ఫోన్స్‌ మరీ ఎక్కువ అవ్వడంతో కొందరు ఎందుకు వచ్చాయిరా బాబోయ్‌ ఈ స్మార్ట్‌ ఫోన్‌లు అనుకుంటున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ల వల్ల ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఫోన్‌లో చూస్తూ యాక్సిడెంట్‌కు గురి అయిన వారు కాగా, మరి కొందరు ఫోన్‌కు బానిసై మానసికంగా చనిపోయిన వారు, మరి కొందరు ఈమద్య కాలంలో వస్తున్న గేమ్స్‌కు పిచ్చి పట్టి వాటి వల్ల చనిపోతున్న వారు. ఇలా ఎన్నో రకాలుగా మానసిక సమస్యలతో ఫోన్‌ల వల్ల మనుషులు చనిపోతున్నారు. కాని మొదటి సారి ఒక స్మార్ట్‌ ఫోన్‌ తన యజమానిని చావు నుండి కాపాడింది.

Mobile Phone Shields Man From Alleged Bow And Arrow Attack-Mobile Telugu Viral News In Social Media

Mobile Phone Shields Man From Alleged Bow And Arrow Attack

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వెల్స్‌ కు చెందిన 43 ఏళ్ల వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తి బాణంతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ వ్యక్తి బాణం వస్తున్న విషయాన్ని గమనించి వెంటనే తన ఫోన్‌తో ఫొటోను తీసేందుకు చూశాడు. అయితే ఆ ఫోన్‌ను దూసుకు పోయి బాణం స్మార్ట్‌ ఫోన్‌ను బద్దలు కొట్టింది. ఒకవేళ అతడి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ లేకుంటే మాత్రం ఆ బాణం తలను ఏదో ఒక స్థానంలో ఢీ కొట్టేది, అప్పుడు అతడు అక్కడిక్కడ ప్రాణాలు వదిలేవాడు.

Mobile Phone Shields Man From Alleged Bow And Arrow Attack-Mobile Telugu Viral News In Social Media

ఈ సంఘటన ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయ్యింది. ఆ ఫోన్‌కు బాణం గుచ్చుకున్న తీరు చూస్తుంటే అదే అతడికి తగిలి ఉంటే స్పాట్‌లోనే ప్రాణాలు పోయేవి అనిపిస్తుంది. తలకు బాణం గురి చూసి వేసిన ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని మాత్రం ఈ వ్యక్తి చెప్పడం లేదు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా వారు ఎలాంటి సమాచారం రాబట్టలేక పోతున్నారు.

Mobile Phone Shields Man From Alleged Bow And Arrow Attack-Mobile Telugu Viral News In Social Media

ఆ బాణం మాత్రం చాలా ప్రదేశాల్లో శిక్షణ తీసుకునే వారి వద్ద ఉంటుందని, ఎవరో శిక్షణ తీసుకునేందుకు ఉపయోగించే బాణాన్ని ఉపయోగించి దాడికి ప్రయత్నించారు అంటూ పోలీసులు ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. మొత్తానికి తన ఫోన్‌ వల్ల తాను ఇప్పుడు బతికి ఉన్నాను అంటూ అతడు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

Mobile Phone Shields Man From Alleged Bow And Arrow Attack-Mobile Telugu Viral News In Social Media