‘నోటా’ లో హీరో విజయ్‌ దేవరకొండనేనా అంటూ అనుమానాలు, ఎందుకంటే..!  

  • విజయ్‌ దేవరకొండ హీరోగా ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నోటా’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ చిత్రంతో తమిళనాట విజయ్‌ దేవరకొండ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విజయ్‌కి ఇది తమిళంలో మొదటి సినిమా కాగా తెలుగులో కూడా విజయ్‌ నటించిన చిత్రాలు ఇప్పటి వరకు మూడు నాలుగు మాత్రమే విడుదల అయ్యాయి.

  • Mind Blowing Pre Release Business Stats Nota Movie-

    Mind Blowing Pre Release Business Stats Nota Movie

  • సినిమాల సంఖ్య ఆధారంగా చూసుకుంటే విజయ్‌ ఒక కొత్త హీరోగా భావించొచ్చు. కాని తమిళనాట ఈయన చిత్రంకు భారీ రేటు పలుకుతుంది. తమిళంలో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయకుండానే అక్కడ భారీగా బిజినెస్‌ చేసిన విజయ్‌ ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆకాశమే హద్దుగా తన సినిమాతో బిజినెస్‌ను సాధిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపుగా 40 కోట్లకు పైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మహేష్‌, రామ్‌ చరణ్‌ వంటి స్టార్‌లకు మాత్రమే ఈస్థాయి బిజినెస్‌ సాధ్యం అవుతుంది.

  • Mind Blowing Pre Release Business Stats Nota Movie-
  • ‘నోటా’ బిజినెస్‌ చూసిన సినీ విశ్లేషకులు ఈ చిత్రంలో నటించింది విజయ్‌ దేవరకొండేనా లేదంటే మరో స్టార్‌ హీరో ఉన్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున నోటా రైట్స్‌ అమ్ముడు పోవడంతో ట్రేడ్‌ వర్గాల వారు షాక్‌ అవుతున్నారు. విజయ్‌ దేవరకొండ స్థాయి ఏ రేంజ్‌లో ఉండే ఈ బిజినెస్‌ చూస్తుంటే అర్థం అవుతుంది అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

  • ‘గీత గోవిందం’ చిత్రంతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిన విజయ్‌ దేవరకొండ తన తదుపరి చిత్రం ‘నోటా’లో సీఎంగా కనిపించబోతున్నాడు. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన ‘భరత్‌ అనేనేను’ చిత్రం ఎంతటి విజయాన్ని దక్కించుకుందో అదే విధంగా ‘నోటా’ కూడా తప్పకుండా అంతటి విజయాన్ని సాధిస్తుందని, అందుకే ఇంత భారీగా బిజినెస్‌ అవుతుందని సినీ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు. అక్టోబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘నోటా’ చిత్రం ఫలితం పాజిటివ్‌ అయితే విజయ్‌ స్టార్‌ హీరోల సరసన తన స్థానంను మరింత పదిలం చేసుకోబోతున్నాడు.