రోడ్డుపై కనిపించే మైలురాళ్లను ఎప్పుడైనా గమనించారా??వాటిపై ఉండే రంగులకు అర్ధం ఏంటో తెలుసా??  

Meaning Of Indian Highway Milestone In Different Colours-

Mile rocks are going to go anywhere on the road when you go to the mall .. you can see where they are. We know where we are going and how much distance we have to go ... However, on the top of the mile rocks we see each color at once. Why do you come across the different colors of the mile stones on the top?

.

If the yellow color on the top of the mile rocks we have to know that we are traveling on the national highway. There are only a few national roads in our country. They are painted in yellow above the mile stones above them. They are known as national highways. If the green color on the top of the mile stones is known as state highways. They are the state governments. The state governments see their supervision ..

. If the white or black color on the top of the mile rocks should be known as the big city or district. Such roads are monitored by the city or district development department.

. If the orange or red color is painted on the top of the mile, we need to know that we are in the village. Also, these roads are understood to have been built by Pradhan Minister Gram Sadak Yojana.

ఎక్కడికైనా వెళ్లేటప్పుడు రోడ్డుపై అక్కడక్కడా దారిపొడవునా మైలు రాళ్లు కనిపిస్తుంటాయి .చూసే ఉంటారు కదా ...

రోడ్డుపై కనిపించే మైలురాళ్లను ఎప్పుడైనా గమనించారా??వాటిపై ఉండే రంగులకు అర్ధం ఏంటో తెలుసా??-Meaning Of Indian Highway Milestone In Different Colours

వాటి ఆధారంగానే మనం ఎక్కడ ఉన్నాం,మనం వెళ్లాల్సిన చోటు ఇంకా ఎంత దూరం అనే విషయాలు తెలుస్తుంటాయి.అయితే మనకు కనపడే మైలు రాళ్ల పై భాగంలో ఒక్కోసారి ఒక్కో కలర్‌ ఉంటుంది.

ఎప్పుడైనా గమనించారా.? మైలు రాళ్లకు భిన్నమైన రంగులను పై భాగంలో ఎందుకు వేస్తారో తెలుసా.

?ఆ రంగులు వేటికి సంకేతాలంటే??

మైలు రాళ్ల పై భాగంలో పసుపు రంగు ఉంటే మనం జాతీయ రహదారిపై(National Highway) ప్రయాణిస్తున్నామని తెలుసుకోవాలి. మన దేశంలో కేవలం కొన్ని మాత్రమే జాతీయ రహదారులు ఉంటాయి. వాటిపై ఉండే మైలు రాళ్లకు పై భాగంలో ఇలా పసుపు రంగులో పెయింట్‌ వేస్తారు.

దీంతో అవి జాతీయ రహదారులు అని తెలుస్తాయి...

మైలు రాళ్ల పైభాగంలో ఆకుపచ్చ రంగు ఉంటే అవి స్టేట్‌ హైవేలు అని తెలుసుకోవాలి. వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వేస్తాయి.

వాటి పర్యవేక్షణను రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి.

మైలు రాళ్ల పై భాగంలో తెలుపు లేదా నలుపు రంగు ఉంటే మనం ప్రయాణిస్తున్నది పెద్ద నగరం లేదా జిల్లా అని తెలుసుకోవాలి. ఇలాంటి రహదారులను ఆ నగర లేదా జిల్లా అభివృద్ధి శాఖే పర్యవేక్షిస్తుంది.

ఇక మైలు రాళ్ల పైభాగంలో ఆరెంజ్‌ లేదా ఎరుపు రంగు పెయింట్‌ వేసి ఉంటే మనం గ్రామంలో ఉన్నామని తెలుసుకోవాలి. అలాగే ఈ రోడ్లను ప్రధాన్‌ మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన కింద నిర్మించారని అర్థం చేసుకోవాలి.

అదండీ మైలురాళ్ల పై భాగంలో ఉండే రంగుల వెనుక కథ.ఈ సారి రహదారులపై ప్రయాణించేటప్పుడు ఆ రంగులను గమనించి,ఏ రోడ్డుపై ప్రయాణిస్తున్నారో ఈజీగా తెలుసుకోండి.