శైలజ రెడ్డి అల్లుడు సక్సెస్‌ అయితే.. అద్బుతమైన కాంబో సెట్‌ కానుంది!  

Maruthi To Direct Vijay Deverakonda-

నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 13న భారీ ఎత్తున విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. మారుతి గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రంపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు...

శైలజ రెడ్డి అల్లుడు సక్సెస్‌ అయితే.. అద్బుతమైన కాంబో సెట్‌ కానుంది!-Maruthi To Direct Vijay Deverakonda

మారుతి గత చిత్రం మహానుభావుడు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా నాగచైతన్య ఈ చిత్రంను చేసే అవకాశంను మారుతికి ఇచ్చాడు. ఇప్పుడు మారుతి ‘శైలజ రెడ్డి అల్లుడు’ సక్సెస్‌ అయితే మరో పెద్ద సినిమా ఎదురు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఈయన చేతిలో ‘నోటా’, ‘ట్యాక్సీవాలా’, ‘డియర్‌ కామ్రెడ్‌’ చిత్రాలతో పాటు ఇంకా రెండు చిత్రాలు ఉన్నాయి.

వచ్చే ఏడాది వరకు విజయ్‌ చాలా బిజీగా ఉన్నాడు. శైలజ రెడ్డి అల్లుడు సక్సెస్‌ అయితే విజయ్‌ దేవరకొండకు కథను వినిపించాలని దర్శకుడు మారుతి భావిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌ వారు ఈ చిత్రంను నిర్మించేందుకు సిద్దం అవుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది..

యూవీ క్రియేషన్స్‌లో ఇప్పటికే మారుతి ఒక చిత్రాన్ని చేశాడు. ఆ నేపథ్యంలోనే యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో విజయ్‌ దేవరకొండ మూవీ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే విజయ్‌ డేట్లు యూవీ క్రియేషన్స్‌ వద్ద ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఆ డేట్లతో మారుతి దర్శకత్వంలో సినిమా చేయాలని వారు భావిస్తున్నారు.

అయితే శైలజ రెడ్డి అల్లుడు సక్సెస్‌ అయితే అప్పుడు చూద్దాం అన్నట్లుగా విజయ్‌ దేవరకొండ చెప్పినట్లుగా తొస్తోంది...

శైలజ రెడ్డి అల్లుడు చిత్రం పూర్తి స్థాయి వినోదభరితంగా తెరకెక్కిందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. అందుకే సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

మారుతి ఇప్పటి వరకు మరీ దారుణమైన సినిమాలు చేయలేదు. యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా, యూత్‌ను మెప్పించే విధంగానే సినిమాను తెరకెక్కించాడు. కనుక ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.

ఇక ఈ చిత్రం తర్వాత విజయ్‌ని మారుతి డైరెక్ట్‌ చేయడం దాదాపు ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. అయితే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది.