'ఏ పని చేయకుండా...తండ్రి సంపాదనతో ఎంజాయ్ చేస్తున్నావ్?' అన్న నెటిజెన్ కు మనోజ్ హైలైట్ కౌంటర్.!  

Manchu Manoj Gives Strong Counter To To Netjens-

ఇటీవల మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంచు మనోజ్ స్పందించారు. ప్రణయ్ పరువు హత్య కరెక్టే అంటూ కొందరు వ్యాఖ్యానించడంపై సినీ నటుడు మంచు మనోజ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు...

'ఏ పని చేయకుండా...తండ్రి సంపాదనతో ఎంజాయ్ చేస్తున్నావ్?' అన్న నెటిజెన్ కు మనోజ్ హైలైట్ కౌంటర్.!-Manchu Manoj Gives Strong Counter To To Netjens

ఇలా వాదిస్తున్న వ్యక్తులు ఉన్న సమాజంలో తాను ఉన్నందుకు సిగ్గుగా ఉందని ఫైర్ అయ్యారు. ఇంత దారుణమైన సంఘటన గురించి నేను మాట్లాడతానని ఎప్పుడూ ఊహించలేదు. కులం అనే గోడల్ని కలం చెరపలేనప్పడు.

అందరూ సమానం, అంతా సమానం, మనుషులంతా ఒక్కటే అని నేర్చించలేని ఈ విద్యా వ్యవస్థ మొత్తం సిగ్గు పడాలి…. అంటూ మంచు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది ఇలా ఉంటె.ఎలాంటి పని చేయకుండా మీ నాన్న సంపాదించిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నావు.

నువ్వు సూపర్ బ్రో… లైఫ్ అంటే నీదే. యంగ్ జనరేషన్‌కు ఇన్స్‌స్పిరేషన్ నువ్వు అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేసారు. దానికి కౌంటర్ గా మంచు మనోజ్ తనదైన శైలిలో ఎలా రిప్లై ఇచ్చారో చూడండి...

“మా నాన్న సంపాదించిన డబ్బు వాడుకుంటే ఆయన ఎంతో సంతోషంగా ఫీలవుతారు. కానీ నేను ముందు నుండి ఆయన డబ్బు ముట్టుకోలేదు.

సినిమాల విషయంలో కూడా ఆయన హెల్ప్ తీసుకోలేదు. కాలేజీ రోజుల్లో రెస్టారెంట్లలో వెయిటర్‌గా, క్లీనర్‌గా పని చేశాను. సినిమాల విషయంలో ఎప్పుడూ కొత్త డైరెక్టర్లను, కొత్త టీంను ఎంచుకుని ఎంచుకుని నాకంటూ ఒక జీవితాన్ని ఏర్పరచుకుంటాను.

” అని స్పందించారు.