4వేల పోస్టర్లతో ప్రియురాలికోసం అన్వేషణ..తనకోసం ప్రతిరోజూ ఒకే గెటప్తో రైల్వేస్టేషన్లో ఎదురుచూస్తున్నాడు..  

  • బ‌స్సుల్లో, ట్రైన్ల‌లో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు ఒక వ్య‌క్తిని చూసి మొదటి చూపులోనే మ‌న‌సిచ్చేస్తాముమాటకలపడానికి ప్రయత్నిస్తాం కుదరకపోతే ప్రయాణం చేస్తున్నంత సేపు కళ్లతోనే మాట్లాడుకుంటాంగమ్యస్థానానికి చేరుకున్నాక మనసు బాధపడినప్పటికి అయిష్టంగానే ఎవరిదారిన వాళ్లం వెళ్లిపోతాంఅయితే అందరూ ఇలాగే ఉంటారని లేదు కొంతమంది తమ ప్రయాణాన్ని ప్రణయంగా మార్చుకుంటారుఆ కోవకు చెందిన వాడే భిశ్వజిత్ పొద్దర్

  • క‌ల‌క‌త్తాలో ప‌ని చేసే భిశ్వ‌జిత్ ఒక రోజు ట్రైన్‌లో ప్ర‌యాణిస్తుండ‌గా ఎదురుగా ఒక అంద‌మైన అమ్మాయి కనిపించింది. చూపు తిప్ప‌లేక పోయాడు. అలా ఎన్నో సార్లూ చూశాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ప‌ట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె త‌న పేరేంట్స్ తో ఉంది.తన నవ్వుకి ఫిధా అయిపోయిన భిష్వా తనని చూడకుండా ఉండలేకపోయాడుమొదట్లో పట్టించుకోకపోయినా,కాసేపటికి అమ్మాయి మ‌న హీరోని చూసి చిలిపి న‌వ్వు న‌వ్వ‌డం, క‌ళ్ల‌తో స‌మాధానాలు చెప్ప‌డం చేసింది.దీంతో భిశ్వ ఆనందానికి అవధులు లేవుకానీ తను ఇష్టపడుతుందని తెలిసింది కానీ,తన గురించి ఏం తెలుసుకోకుండానే ఆ అమ్మాయి దిగాల్సిన స్టేషన్ వచ్చిందిట్రెయిన్ దిగే ముందు ఆ అమ్మాయి నెంబ‌ర్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించింది. కానీ త‌ల్లిదండ్రులు ఉండ‌టంతో కుద‌ర‌లేదు.

  • Man Puts Up 4 000 Posters In Kolkata Search Of Girl-

    Man Puts Up 4,000 Posters In Kolkata In Search Of Girl

  • మొదట ఆ అమ్మాయిని చూసిన భిశ్వ తనకు ఇష్టం లేకుండా ఆ అమ్మాయిని కష్టపెట్టడం సరికాదనుకున్నాడుకానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి కూడా భిశ్వని ఇష్టపడుతుందని అర్ధం అయిందో అప్పుడే గట్టిగా ఫిక్సయ్యాడు. ఎలాగైనా తనని క‌ల‌వాలని త‌న మ‌న‌సులో మాట చెప్పాల‌ని… అందుకే ఆమె కోసం ఆ రెండు మూడు స్టేష‌న్స్‌తో తిర‌గ‌డం ప్రారంభించాడు. వ‌ర్క‌వుట్ కాలేదు. దాంతో త‌న వివ‌రాలు ఉన్న పోస్ట‌ర్స్‌ని క‌ల‌క‌త్తా అంతా అంటించాడు. దాదాపు 4000 పోస్ట‌ర్స్ అంటించినా అమ్మాయి గురించి ఎలాంటి స‌మాచారం లేదు. ఆమెను చూసిన‌ప్పుడు అత‌ను ధ‌రించిన టీష‌ర్టునే దాదాపు నెల‌నుంచి ప్ర‌తీ రోజు వేసుకుంటున్నాడు. అలా చూసి అయినా ఆ అమ్మాయి క‌లుస్తుందేమో అని అతని ఆశ‌.సేమ్ డ్రెస్,సేమ్ బ్యాగ్ వేసుకుని ఆ అమ్మాయి ఏ స్టేషన్లో అయితే దిగి వెల్లిపోయిందో అదే స్టేషన్లో తన కోసం ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడుప్రతిరోజు ఆఫీస్ అయిపోగానే రాత్రి చీకటి పడేవరకు ఆ స్టేషన్లో కూర్చోవడం ఇదే భిశ్వ దినచర్య.ఆ అమ్మాయి భిశ్వ తో క‌ల‌వాల‌ని కోరుకుందాం.