కొత్త పార్టీ పెట్టబోతున్న కొండా దంపతులు ..?  

Konda Family New Political Party-

టీఆర్ఎస్ అధినాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించిన కొండా దంపతుల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది.? వారి రాజకీయ అడుగులు ఏ పార్టీ వైపు పడబోతున్నాయ్ ...

కొత్త పార్టీ పెట్టబోతున్న కొండా దంపతులు ..?-Konda Family New Political Party

? అసలు వారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది.? ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణాలో ప్రజల మధ్య చర్చకు వస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్ లో కొండా సురేఖ పేరు లేకపోవడంతో మొదలయిన ఈ రచ్చ గులాబీ బాస్ ఆయన ఫ్యామిలీ పై వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది.

కేసీఆర్ స్వయంగా కొండా దంపతులతో మాట్లాడారని, వినాయక నవరాత్రులు ముగిసే వరకు తాము బయటకు రాలేమని చెప్పారని.

నవరాత్రులు ముగియగానే వచ్చి కేసీఆర్ ను కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు.

నవరాత్రులు ముగియగానే. ప్రెస్ మీట్ పెట్టి మరీ కేసీఆర్ పై కేసీఆర్ ఫ్యామిలీపై విమర్శలు ఎక్కుపెట్టారు కొండా దంపతులు. తాము హరీష్ రావు వర్గమే అంటూ ఆయన్ను కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టే పెడుతున్నారు అంటూ… నిప్పులు చెరిగారు. ఇక టీఆర్ఎస్ లో కొండా దంపతులు ఇక ఉండరని తేలిపోయింది.

ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ మీద వ్యక్తిగత ఆరోపణలు చేసి పొలిటికల్ హీట్ పెంచారు.కుటుంబ పాలన నుంచి ప్రాజెక్టుల వరకు అన్నింటిపై ఓ బహిరంగ లేఖ రాసారు.

ఇది ఇలా ఉంటే వారు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. కానీ వారు చేరలేదు. కాంగ్రెస్ లో చేరతామని వీళ్లు కూడా ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు...

కానీ కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ లోకి వస్తోందని. అక్కడి లీడర్లు కొంతమంది ప్రచారం చేశారు.

ఇప్పటికీ తన పుర్వాశ్రమమైన కాంగ్రెస్ వైపే కొండా దంపతులు చూస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

మరి కొండా దంపతుల దారెటు.

? ఏ పార్టీలో చేరబోతున్నారు.? ఏ పార్టీ తరుపున ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారు...

? అనే ప్రశ్నలు తాజాగా వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా కొత్త నిర్ణయం తీసుకుంటున్నారట కొండా దంపతులు.

ఆ పార్టీ. ఈ పార్టీలో చేరడం ఏంటీ.

? సొంతంగా ఓ పార్టీ పెడితే అయిపోతుంది కదా అనే ఆలోచనలో ఉన్నారట. పార్టీకి సంబంధించిన ప్రణాళిక మొత్తం రెడీ అయ్యిందట...

మరో పది రోజుల్లో పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయని స్వయంగా కొండా మురళీ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దొరల పాలనకు వ్యతిరేకంగానే తమ పార్టీ పోరాటం చేస్తుందని.ఎజెండా కూడా బయటపెట్టేశారు కొండా మురళి. పార్టీ విషయమై కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.