కీర్తి సురేష్‌ క్రేజ్‌ టాలీవుడ్‌లో మరీ ఇంత భారీగా ఉందా.. నిర్మాతలు ఈమెపై మరీ ఆశలు పెట్టుకుంటున్నారు  

Keerthy Suresh Craze Peeks At Tollywood-

తెలుగు ప్రేక్షకులకు ‘నేను శైలజ’ చిత్రంతో కీర్తి సురేష్‌ పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా కూడా సో సో హీరోయిన్‌గానే ఈమెకు గుర్తింపు దక్కింది. పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించినా కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు...

కీర్తి సురేష్‌ క్రేజ్‌ టాలీవుడ్‌లో మరీ ఇంత భారీగా ఉందా.. నిర్మాతలు ఈమెపై మరీ ఆశలు పెట్టుకుంటున్నారు-Keerthy Suresh Craze Peeks At Tollywood

కాని ఎప్పుడైతే ఈమె ‘మహానటి’ చిత్రంలో నటించిందో అప్పుడే ఈమె స్థాయి అమాంతం పెరిగి పోయింది. స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌లో ఈమె స్థాయి పెరిగింది. తెలుగులో ప్రస్తుతం ఈమె నటించడం లేదు.

తమిళంలోనే ఈమె చాలా బిజీగా ఉంది. ఇక తమిళంలో ఈమె నటిస్తున్న చిత్రాలకు తెలుగులో భారీ డిమాండ్‌ ఉంది.

తమిళంలో ఈమె తాజాగా విక్రమ్‌కు జోడీగా ‘సామి’ చిత్రంలో నటించింది. తెలుగులో ‘సామి’ డబ్బింగ్‌ రైట్స్‌ ఏకంగా 8 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగులో విక్రమ్‌ సినిమాలకు పెద్దగా మార్కెట్‌ లేదు.

అయినా కూడా ఈ చిత్రం ఇంత భారీగా అమ్ముడు పోయింది అంటే ఖచ్చితంగా హీరోయిన్‌ కీర్తి సురేష్‌ వల్లే అంటూ చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి టాక్‌ వినిపిస్తుంది. భారీ ఎత్తున ఈ చిత్రం రైట్స్‌ను తెలుగులో కొనుగోలు చేసిన నిర్మాతలపై ట్రోల్స్‌ వ్యక్తం అవుతున్నాయి. కీర్తి సురేష్‌ను చూసి ఇంత భారీ మొత్తానికి కొనుగోలు చేయడం ఏంటీ అంటూ కొందరు ఆగహ్రం వ్యక్తం చేస్తున్నారు...

‘సామి’ చిత్రం తెలుగులో ఖచ్చితంగా పెద్దగా అలరించదు. విక్రమ్‌కు తెలుగులో క్రేజ్‌ లేని కారణంగా డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రంను కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దాంతో డబ్బింగ్‌ రైట్స్‌ దక్కించుకున్న నిర్మాత స్వయంగా ఈ చిత్రంను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కీర్తి సురేష్‌పై నిర్మాత పెట్టుకున్న నమ్మకం నిలిచేనా, అసలు సినిమాను కీర్తి సురేష్‌ తన క్రేజ్‌తో ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లగలదా అంటూ సినీ వర్గాల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయిదు కోట్ల వరకు ఈ చిత్రంను కొనుగోలు చేస్తే సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తే కలెక్షన్స్‌ వచ్చేవని, పెట్టుబడి రికవరీ అయ్యేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.