కౌశల్‌ ఆర్మీ దెబ్బకు ‘దేవదాస్‌’ వాయిదా పడనుందా?  

Kaushal Army Targets Nani Devadas Movie-

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 పార్టిసిపెంట్‌ కౌశల్‌ కు ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కోసం భారీ ఎత్తున అభిమానులు కార్యక్రమాలు చేపడుతున్నారు. కౌశల్‌ ఆర్మీ అంటూ ఒక సోషల్‌ మీడియా గ్రూపు ఏర్పాటు అయ్యి మరీ కౌశల్‌కు మద్దతుగా ఉంటున్నారు. కౌశల్‌ ఆర్మీ ఇతర ఇంటి సభ్యులను మరియు నానిని గత కొన్ని రోజులుగా ట్రోల్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా నానిపై కౌశల్‌ ఆర్మీ దుమ్మెత్తి పోస్తున్న విషయం తెల్సిందే. పదే పదే కౌశల్‌ గురించి నాని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నానిని కౌశల్‌ ఆర్మీ టార్గెట్‌ చేస్తున్నారు.

Kaushal Army Targets Nani Devadas Movie-

Kaushal Army Targets Nani Devadas Movie

ఇప్పటికే నాని బిగ్‌ బాస్‌ హోస్ట్‌గా పనికి రాడు అంటూ జాతీయ స్థాయిలో ట్విట్టర్‌ ద్వారా ట్రెండ్‌ చేసిన కౌశల్‌ ఆర్మీ తాజాగా నాని దేవదాస్‌ చిత్రంను బ్యాన్‌ చేయాల్సిందిగా సోషల్‌ మీడియా ద్వారా పిలుపునివ్వడం జరిగింది. వరుసగా వరుసగా కౌశల్‌ ఆర్మీ చేస్తున్న పనుల కారణంగా నాని పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తాజాగా తాను నటించిన ‘దేవదాసు’ చిత్రంను కౌశల్‌ ఆర్మీ టార్గెట్‌ చేయడంతో నాని టెన్షన్‌ పడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. బిగ్‌బాస్‌ సందడి పూర్తి అయ్యే వరకు సినిమా వాయిదా వేస్తే బాగుంటుందేమో అనే అభిప్రాయంకు కూడా నాని వచ్చాడట.

Kaushal Army Targets Nani Devadas Movie-

నాగార్జున, నాని కలిసి నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్‌’. శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రంను ఈ వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. కాని కౌశల్‌ ఆర్మీ ఈ చిత్రం విడుదలైన తర్వాత నెగటివ్‌ ప్రచారం చేసే అవకాశం ఉందని అనిపిస్తుంది. అందుకే బిగ్‌బాస్‌ పూర్తి అయ్యే వరకు సినిమాను వాయిదా వేయడం మంచిదనే అభిప్రాయంలో వారు ఉన్నారట.

సోషల్‌ మీడియాలో కౌశల్‌ ఆర్మీకి భయపడి సినిమాను వాయిదా వేయాల్సిన అవసరం లేదు అంటూ కొందరు సలహా ఇస్తున్నారు. సినిమా బాగుంటే ఏ ఒక్కరు సినిమాను ఏం చేయలేరని, సినిమాను వాయిదా వేయాల్సిన పని లేదని, నానిని టెన్షన్‌ పడొద్దంటూ నాగార్జున చెప్పుకొచ్చినట్లుగా సమాచారం అందుతుంది.