కరుణానిధి తన ప్రియురాలితో పెళ్లికి నిరాకరించడానికి కారణం ఏంటో తెలుసా?  

Karunanidhi Sacrificed Love For Principles-

డీఎంకే దిగ్గజం కరుణానిధి నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే.సుమారు యాభై ఏళ్లపాటు డిఎంకే పార్టిని ముందుండి నడిపిన రధసారధికరుణానిది కరడుగట్టిన నాస్తికుడుసంప్రదాయ కుటుంబంలో పుట్టినప్పటికి సంప్రదాయాలకు పూర్తి వ్యతిరేఖిసంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి తన ప్రియురాలిని దూరం చేసుకున్నారంటే సంప్రదాయాల పట్ల కరుణ ప్రవర్తన తెలుసుకోవచ్చు

Karunanidhi Sacrificed Love For Principles-

Karunanidhi Sacrificed Love For Principles

పెళ్లికి గుర్తుగా నిలిచే తాళిబొట్టు కట్టాలన్న కారణంగా కరుణానిధి తన ప్రేమికురాలితో పెళ్లికి నిరాకరించారట. కరుణానిధి సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడాన్ని ఇష్టపడకపోవడంతో తన ప్రేమికురాలిని వివాహం చేసుకోలేదట. 1944లో కరుణానిధి ప్రియురాలి కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అంగీకరిస్తూ సంప్రదాయబద్ధంగా వివాహం చేయాలనుకున్నారు అయితే దీనిని కరుణానిధి నిరాకరించి తనకు మంగళ సూత్రమన్నా, మంత్రోచ్ఛారణలన్నా పడవని వారితో తెగేసి చెప్పేశారట.ప్రియురాలితో పెళ్లి జరగకపోవడానికి కారణం తాళి కట్టడానికి కరుణ ఇష్టపడకపోవడమే ఈ ఘటనతో ఆవేదన చెందిన కరుణ ప్రియురాలు కూడా మరో వివాహం కూడా చేసుకోలేదట.

ఆచారాలను వ్యతిరేకించే కరుణానిధి జీవితంలో ఇటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి.దేవున్ని నమ్మని కరుణానిది తన చివరి శ్వాస వరకు నాస్తికుడిగానే ఉన్నారు.సత్యసాయి మహిమల్ని నమ్మనప్పటికి సాయి చేసే సేవా కార్యక్రమాలను అభినందించేవారు కరుణానిది.