ఒట్టు..పవన్ ని ఓడించి తీరుతాం..బీసీల శపథం  

Kapu Caste Wants Dipiet Pawan Kalyan Janasena-

ఇప్పుడు ఏపీలో అత్యంత సున్నితమైన అంశం ఏదన్నా ఉంది అంటే అది కాపుల రిజర్వేషన్ అంశమే ఆ ఒక్క అంశంతో అన్ని పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది. ఏ పార్టీ ఈ అంశాన్ని ఎత్తుకోవాలని అనుకున్నా సరే ఒక పక్క బీసీల ఆగ్రహానికి గురవ్వాల్సిందే అయితే ఇదే సమయంలో కాపుల అంశాన్ని ఎత్తుకొక పోతే కాపుల ఆగ్రహానికి గురవ్వాల్సిందే ఈ పరిస్థితిలో అన్ని పార్టీలకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారిపోయింది...

ఒట్టు..పవన్ ని ఓడించి తీరుతాం..బీసీల శపథం-Kapu Caste Wants Dipiet Pawan Kalyan Janasena

అయితే

పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ అంశంపై మాట్లాడి రేపిన చిచ్చు తో కాపులు సంతోషం వ్యక్తం చేశారు తప్ప పవన్ బీసీల ఆగ్రహానికి గురయ్యాడు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు దాంతో ఇప్పుడు బీసీలు అందరూ పవన్ పై గుర్రుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. పవన్ కేవలం తమ సామాజిక వర్గానికి కాపు కాస్తాడా అనే సందేహాలు బీసీల మెదడుని తొలిచేస్తున్నాయి.

అయితే కాపులకు నాయకత్వం వహించడానికి పవన్ పార్టీ పెట్టాడా అనే స్థాయికి ఇవి వెళ్లిపోయాయి..

ఏది ఏమైనా సరే కాపులకి రిజర్వేషన్లు సాధిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇప్పుడు బీసీల ఏకైక టార్గెట్ గా పవన్ మారిపోయాడు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీల సంఘాల నేతలు సైతం పవన్ పై తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో మార్చాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.పవన్ కేవలం కాపుల మద్దతే కావాలని అనుకుంటే మా అవసరం లేదనే కదా అర్థం అంటూ తీవ్ర అసహానం వ్యక్తం చేస్తున్నారు…అంతేకాదు ఏకంగా ఒట్లు వేసుకుని మరీ పవన్ కి ఓట్లు వేయకూడదు అంటూ సపధాలు చేస్తున్నారట.

అయితే ఈ పరిణామాలన్నీ దగ్గరగా చూస్తున్న జనసేన నాయకులు పవన్ కి దూకుడు అన్ని విషయాలలో పనికి రాదు అంటూ సొంత పార్టీ నేతలే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలాఉంటే బీసీలు ఇంత పెద్ద ఎత్తున పవన్ పై ఫైర్ అవ్వడానికి కారణం మాత్రం చంద్రబాబు స్కెచ్ అనే టాక్ కూడా వినిపిస్తోంది...

కావాలనే బీసీలని పవన్ పై బాబు ఉసిగొల్పారు అంటున్నారు విశ్లేషకులు.ఈ తరుణంలో మరి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో యూ టర్న్ తీసుకుంటాడో లేదో అనేది వేచి చూడాల్సిందే.