బాబాయ్ హత్యలో చంద్రబాబు హస్తం! వైసీపీ జగన్ సంచలన వాఖ్యలు  

ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేసిన వైసీపీ అధినేత జగన్. .

Jagan Sensational Comments On Cbn About Vivekananda Reddy Murder-april 11 Elections,chandrababu,jagan Sensational Comments On Cbn,pundula,tdp,vivekananda Reddy Murder,ysrcp

తన బాబాయ్ ని అత్యంత కిరాతకంగా, ఇంట్లోకి వచ్చి నేరుగా బెడ్ రూమ్ లోకి వెళ్లి హత్య చేసారని వైసీపీ అధినేత జగన్ మీడియా ముందు సంచలన వాఖ్యలు చేసారు. అలాగే ఈ కేసు వెనుక చంద్రబాబు హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయని కూడా జగన్ తీవ్ర వాఖ్యలు చేసారు. ఇప్పుడు జగన్ వాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. తనకి ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, చంద్రబాబు హయాంలోనే తన తాత హత్యకి గురయ్యాడని, అలాగే తన తండ్రికి కూడా కుట్ర పూరితంగా హతం చేసారని, తనని కూడా హత్య చేసే ప్రయత్నం చేసారని, ఇప్పుడు ఏకంగా తన బాబాయ్ ని చంపేశారని సంచలన వాఖ్యలు చేసారు.

తన బాబాయ్ హత్యపై చంద్రబాబు సిట్ వేసారని, అయితే తాను ఎస్పీ దగ్గర ఉండగానే ఇంటలిజెన్స్ నుంచి అతనికి ఫోన్స్ వచ్చాయని, దీనిని బట్టి విచారణ న్యాయంగా జరగడం లేదనిపిస్తుంది అని అన్నారు. తన బాబాయ్ హత్యపై సిబిఐ విచారణ జరగాలని, దాని కోసం ఎంతవరకైన న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. అలాగే ఈ సంఘటనకి రియాక్ట్ అయ్యి వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, తనకి న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉందని, 30 ఏళ్ల రాజకీయ జీవితంలో సౌమ్యుడుగా పేరున్న బాబాయ్ ని చంపేంతగా తెగించారంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది అని అన్నారు.