సుజనాచౌదరి ఆస్తులపై ఐటీ దాడులు ! ఆ లిస్టులో ఇంకెవరో..?  

  • గత కొద్ది రోజులుగా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు టీడీపీ నాయకులే టార్గెట్ గా వారి ఆస్తులకు సంబంధించి లావాదేవీలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే కోణంలో రైడ్స్ చేస్తున్నారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన వ్యాపార సంస్థలపై వరుస దాడులు చేశారు. సుజనా చౌదరికి చెందిన 160 కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లను సైతం వారు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

  • IT Raids On Sujana Chowdary Assets Anyone In That List-

    IT Raids On Sujana Chowdary Assets Anyone In That List

  • ఇప్పటికే అధికార టీడీపీ వాళ్లు మోడీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీపై కక్ష కట్టి తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల కంపెనీలపై వరుసగా ఐటీ దాడులు చేయిస్తున్నట్టు గగ్గోలు పెడుతున్నారు. ఐటీ దాడులు పరంపర అప్పుడే అయిపోలేదని టీడీపీలో పెద్ద తలకాయలే అసలు టార్గెట్ గా తెలుస్తోంది. అయితే ఈ వరుస దాడులతో నాయకులంతా వణికిపోతున్నారు.