బాబు భయపెడుతున్నాడు .. కాదు కాదు భయపడుతున్నాడు  

Is Chandrababu Naidu Afraid About 2019 Elections-

ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా. ఏమాత్రం కంగారు పడకుండా ధైర్యమే తన బలం అనుకుంటూ … అలా ముందుకు వెళ్లిపోయే ఏపీ సీఎం చంద్రబాబు లో ఇప్పడు ఆ కాన్ఫిడెన్స్ కనిపించడంలేదు. ఎందుకో లోలోపల భయపడుతున్నాడు...

బాబు భయపెడుతున్నాడు .. కాదు కాదు భయపడుతున్నాడు -Is Chandrababu Naidu Afraid About 2019 Elections

ఇప్పుడు ఆ భయం పార్టీ ఎమ్యెల్యేలతో కూడా పంచుకుని వారిని కూడా భయపెడుతున్నాడు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలతో సమావేశం అయిన చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి మాట్లాడతాడు అని అంతా అనుకుంటే ఎవ్వరూ ఊహించని విధంగా వచ్చే ఎన్నికల్లో ఓటమి గురించి మాట్లాడి అందరికి షాక్ ఇచ్చాడు.

వచ్చే ఎన్నికల్లో మొత్తం ఎంపి సీట్లన్నింటిలో గెలుస్తాం, ఎనభై శాతం పైగా ఎమ్మెల్యే సీట్లు మనవే, ప్రజలు టిడిపి పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు అని అనుక్షణం తన డబ్బా తానే కొట్టుకునే చంద్రబాబు సడన్‌గా ఓటమి గురించి మాట్లాడడం, ప్రజల్లో టిడిపి ప్రభుత్వం పట్ల, అధికార పార్టీ ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకత గురించి ఆందోళన వ్యక్తం చేయడం టిడిపి ఎమ్మెల్యేలలో ఆందోళన పెంచింది. తాను వ్యక్తిగతంగా చేయించిన సర్వేలో దాదాపు సగం మందికి పైగా ఎమ్మెల్యేలు ఓడిపోతారని తేలిందని చంద్రబాబు ఎమ్మెల్యేలతో చెప్పడంతో ఎమ్మెల్యేలు షాక్ తిన్నారు.

ఇప్పటి వరకూ జాతీయ స్థాయి సర్వేల్లో కూడా 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమి ఖాయం అని తేలినప్పటికీ బాబు మాత్రం ఆ వార్తలను కందించారు. అదంతా ఉత్తిదే అన్నారు చంద్రబాబు ధైర్యంగా ఉన్నారు టిడిపి ఎమ్మెల్యేలు కూడా దైర్యంగా ఉంటూ వచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ సారి అలాంటి అస్త్రాలు ఏమీ లేవని, ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమి ఖాయం అని గట్టిగా చెప్పడం ఇప్పుడు టిడిపి నాయకుల్లో టెన్షన్ పెంచుతోంది. అభ్యర్థులను మారిస్తే తప్ప దాదాపు సగం మందికి పైగా ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఖాయం అని చంద్రబాబు అన్న మాటలు అయితే టిడిపి నేతలందరికీ నిద్రలేకుండా చేస్తున్నాయి..

2019 ఎన్నికల్లో టిడిపి గెలిచే ఛాన్సే లేదని తేల్చి చెప్తున్న సర్వేల నేపథ్యంలోనే టిడిపి విజయంపై ఆ పార్టీ నాయకుల్లో కూడా ఇప్పటికే చాలా సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు ఓటమి భయం నేపథ్యంలో తెలుగు దేశం ఎమ్మెల్యేల్లో ఆందోళన తారా స్థాయిలో ఉండడం 2019 ఎన్నికల ఫలితాలను ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రచార వ్యూహాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి ఓట్లేస్తారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే టిడిపి ఎమ్మెల్యేల మెదళ్ళలో ఓ స్థాయిలో టెన్షన్ పెంచుతున్నాయి. అదీకాకుండా తమకు దౌర్యం చెప్పాల్సిన అధినేతే ఇలా ఓటమి పై ఆందోళన చెందడం పార్టీ నాయకుల్లో మరింత భయం పెంచుతోంది.