అమెరికాకి భారతీయసందర్శకులు పెరుగుతున్నారట  

India One Of Us\' Most Significant Tourism Origin Countries-

అమెరికాలో ఎంతో మంది భారతీయులు వివిధ రంగాలలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే కొంతమంది మాత్రం చదువుల నిమ్మిత్తం వెళ్తున్నారు మరి కొంతమంది సాధారణంగా అనారోగ్య కారణాల వలన మరి కొంత మంది సినిమా వాళ్ళు షూటింగ్స్ నేపధ్యంగా ఇలా ఎంతో మంది ఎన్నో రకరకాల కారణాల వలన అమెరికాకి వచ్చి వెళ్తూ ఉంటారు అయితే...

అమెరికాకి భారతీయసందర్శకులు పెరుగుతున్నారట-India One Of US' Most Significant Tourism Origin Countries

తాజాగా పెరుగుతున్న గణాంకాల ఆధారంగా చూస్తే మన దేశం నుంచీ అమెరికాకి వెళ్ళే వారి సంఖ్య 2016తో పోలిస్తే 2017లో 6.5% మేర పెరిగినట్లు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది…2016లో దాదాపు 12.06 లక్షల మంది, 2017లో 12.85 లక్షలమంది వెళ్లారని తెలిపింది. అమెరికా ఓడరేవులు, విమానాశ్రయాల ద్వారా రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఈ లెక్క వేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

అమెరికాకు భారతీయుల రాకపోకలు తగ్గుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని.ఎప్పటికప్పుడు భారత్ తో అమెరికాకి మంచి సంభంధాలు ఉన్నాయని ఈ రాకపోకలతో అమెరికా పర్యాటకం కూడా ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపింది అయితే ట్రంప్ పెట్టిన వీసా ఆంక్షల నేపధ్యంలో గతంలో భారతీయుల సంఖ్య తగ్గిందన్న వార్తలు నిజం కాదని కొట్టి పారేసింది.