క్రికెట్ ప్రపంచ కప్ వచ్చేస్తుంది , మరి కోహ్లీ సేన ఆందోళన దేనికి  

Icc Cricket World Cup 2019 Indian Team-ambati Rayudu,icc Cricket World 2019,indian Team,ms Dhoni,virat Kohli

భారత్ ప్రపంచ కప్ ముందు స్వదేశం లో ఆడాల్సిన చివరి వన్డే సిరీస్ కూడా ఆడేసింది , ఒక నెల క్రితం వరకు 2019 ప్రపంచ కప్ ఫేవరేట్లలో ఇంగ్లాండ్ తో పాటు భారత్ కూడా ఫైనల్ చేరే జట్లు అని జోస్యం చెప్పారు కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారు గా కనిపిస్తుంది. భారత్ తో పోలిస్తే ఏ మాత్రం అనుభవం లేని కంగారు జట్టు పైన టీ20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కూడా ఓడిపోయింది అది కూడా సొంత గడ్డపైన.

బౌలింగ్ ఎలా ఉంది ?

భారత్ జట్టు కు ఎంతో కాలం నుండి ప్రధాన సమస్య బౌలింగ్ అందులో డెత్ బౌలింగ్ సమస్య ఎక్కువగా ఉండేది. అయితే గత కొంత కాలంగా భారత్ ప్రపంచం లొనే బెస్ట్ డెత్ బౌలింగ్ జట్టుగా ఎదిగింది దీనికి కారణం భువనేశ్వర్ కుమార్ , షమీ , బుమ్రా పేస్ త్రయమే. ప్రపంచ కప్ జరిగే ఇంగ్లాండ్ లో పిచ్ లు పేస్ బౌలర్ల కు సహకరిస్తాయి. అక్కడ గతేడాది సిరీస్ లో ఈ పేస్ త్రయం చాలా చక్కగా ఆకట్టుకుంది. ఇక స్పిన్ జోడి కుల్దీప్ , చాహల్ మధ్య ఓవర్లలో పరుగులు నియాత్రిస్తూ వికెట్ లు కూడా తీస్తూ ఉండడం భారత్ కు ఎంతో బలం. కేదార్ జాధవ్ , హార్దిక్ లని పిచ్ కి తగ్గట్టు బౌలింగ్ చేయగలడం భారత్ బౌలింగ్ ని మరింత పటిష్టంగా చేస్తుంది.

ICC Cricket World Cup 2019 Indian Team-Ambati Rayudu Icc Indian Team Ms Dhoni Virat Kohli

ICC Cricket World Cup 2019 Indian Team

అసలు సమస్య ఏంటి?

గత ప్రపంచ కప్ తరువాత నుండి ఇప్పటి వరకు భారత్ బాటింగ్ లో టాప్ ఆర్డర్ పైనే ఎక్కువగా ఆధారపడింది. ఓపెనర్లు లేదా కోహ్లీ ఆడితే తప్ప భారీ స్కోర్ లు చేయలేకపోతుంది , మిడిల్ ఆర్డర్ బాటింగ్ వల్ల భారత్ గెలిచిన మ్యాచ్ లు వేళ్ళ మీద లెక్కేట్టచ్చు. అసలు సమస్య నెంబర్ 4 బ్యాట్స్ మెన్ ఈ స్థానం కోసం రాయుడు , దినేష్ కార్తీక్ , కె ఎల్ రాహుల్ , రిషబ్ పంత్ లతో ప్రయత్నించారు ఎవరు నిలదొక్కుకోలేకపోయారు. వన్డే క్రికెట్ లో నెంబర్ 4 స్థానంకి చాలా ప్రాముఖ్యం ఉంది ఓపెనర్లు త్వరగా ఔట్ అయిపోతే నెంబర్ 4 స్థానం లో వచ్చే బ్యాట్స్ మెన్ ఏ బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు మంచి స్కోర్ ని అందించాలి .ఇక పోతే లక్ష్య చేదనలో కూడా పరిస్థితి మరీ దారుణంగా ఉంది చివరి రెండు సంవత్సరాల్లో కోహ్లీ పైనే ఎక్కువ ఆధారపడింది. ఇక భారత్ ప్రపంచ కప్ వరకు ఎటు వంటి అంతర్జాతీయ మ్యాచ్ లు లేకపోవడం ఇంతకుముందు చేసిన ప్రయోగాలు ఫలించకపోవడం భారత్ ను తీవ్ర ఇబ్బంది పెడుతుంది. టీం ఇండియా సెలెక్టర్లు ఏ విదంగా జట్టుని ఎంపిక చేస్తారో చూడాలి. ఇంకొన్ని రోజుల్లో ఐపీల్ ఆరంభమవుతుంది అందులో భారత ఆటగాళ్లకు గాయలయితే ప్రపంచ కప్ లో మరింత ఇబ్బంది పడాల్సివస్తుంది.

ICC Cricket World Cup 2019 Indian Team-Ambati Rayudu Icc Indian Team Ms Dhoni Virat Kohli

ప్రపంచ కప్ కి టీం ఎలా ఉండబోతుంది

1. రోహిత్ శర్మ
2. శిఖర్ ధావన్
3. విరాట్ కోహ్లీ
4. అంబటి రాయుడు
5. హార్దిక్ పాండ్య / విజయ్ శంకర్
6. ఎం ఎస్ ధోని
7. కేదార్ జాధవ్
8. రవీంద్ర జడేజా
9. భవనేశ్వర్ కుమార్
10. జస్పిరిత్ బుమ్ర
11. చాహ్ల
12. కుల్ దీప్ యాదవ్
13 . మొహమ్మద్ షమీ
14 . దినేష్ కార్తీక్ / రిషబ్ పంత్
15 . ఉమేష్ యాదవ్ / ఖలీల్

క్రికెట్ ప్రపంచ కప్ మే 30 నుండి జులై 14 వరకు ఇంగ్లాండ్ లో జరగనున్నాయి.