చావులోను తోడు నీడ! భార్యాభర్తల బంధానికి చెరగని ముద్ర!  

ములుగు జిల్లాలో ఒకే సమయంలో చనిపోయిన భార్యభర్తలు. .

Husband Died Health Problem And Wife Died Heart Stroke-died Heart Stroke,family,husband,love,relationship,wife

ఈ మధ్య కాలంలో వివాహ వ్యవస్థ ఎంతగా విచ్చిన్నం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెళ్లి తర్వాత కూడా స్త్రీ, పురుషులు వివాహేతర సంబంధాలతో ఒకరిని ఒకరు చంపుకునే వరకు వస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలలో తరుచుగా ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న హత్యలు చూసి మానవీయ బంధాలు ఎంతగా దిగాజారిపోయాయో అని బాధపడే పరిస్థితి వచ్చింది.

ఇలాంటి సమాజంలో కూడా భార్య భర్తల బంధానికి చెరగని గుర్తుగా, ఏడు అడుగులు నడిచి, జీవితాంతం తోడుగా ఉంటా అని పెళ్లి నాటి ప్రమాణాలతో ఇద్దరు ఒకటిగా కలిసి బ్రతికిన జంట ఇప్పుడు ఒకే సారి ప్రాణాలు విడిచారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలో గోవిందరావు పేటకి చెందిన నీరతి సారయ్య అనారోగ్యంతో మరణించాడు. భర్త మరణ వార్త విన్న సారయ్య భార్య లచ్చక్క గుండెపోటుకి గురైంది. ఆమెని సమీపంలో హాస్పిటల్ కి తరలించే లోపే తనువు చాలించింది. చావులో కూడా భర్త వెంటే నడిచిన ఈ జంట చావులో కూడా తోడునీడగా నిలిచారని ఇప్పుడు ఆ గ్రామంలో అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు.