యూఏఈ దీర్ఘకాలిక వీసా..ఎలా అంటే  

How To Get Permanent Visa In Uae-

యూఏఈ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్) తమ దేశంలో దీర్ఘకాలికంగా అంటే రిటైరయ్యాక కూడా ఉండాలి అనుకునే వారికి అక్కడ షరతులని సవరిస్తూ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది…దాదాపు తమ ఆరు ఎమిరేట్స్ లలో 55 వచ్చి రిటైరయ్యాక కూడా అక్కడే ఉండేలా విదేశీయులకు దీర్ఘకాలిక నివాస వీసా ఇవ్వాలని నిర్ణయించింది…అయితే ఈ వీసా జారీ చేయడానికి కొన్ని షరతులు విధించింది అదేమంటే..

యూఏఈ దీర్ఘకాలిక వీసా..ఎలా అంటే-How To Get Permanent Visa In UAE

రిటైరయ్యాక అంటే 55 ఉళ్ళు దాటాక మరో అయిదేళ్ళ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు…అయితే మరి దాన్ని రెన్యువల్ చేయడానికి సదరు వ్యక్తి కనీసం కనీసం 20 లక్షల దర్హమ్‌ల ఆస్తిని ఎమిరేట్స్‌లో కొనుగోలు చేసి ఉండాలి లేదా సుమారు 10 లక్షల దిర్హమ్‌ల సేవింగ్స్‌ ఉండాలి లేదా నెలకు 20వేల దిర్హమ్‌ల ఆదాయం క్రమం తప్పకుండా వచ్చే ఏర్పాటు ఉండాలి.

అయితే వీటిలో ఏ ఒక్క షరతుకి లోబడి లేకపోయినా వారిని తమ కంట్రీస్ లో ఉండనివ్వరు.ఈ కండిషన్స్ లో ఏ ఒక్క నిభంధనకి అయినా సరే లోబడిన వారికి దీర్ఘకాలిక వీసా ఇస్తారు.

తమ ఎమిరేట్స్ ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 2019 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది.