నాగార్జునపై పరిశ్రమ ప్రముఖుల ఆగ్రహం  

Hero Nagarjuna Tongue Slip About Tollywood Movies-

అక్కినేని నాగార్జునపై ప్రస్తుతం సినీవర్గాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఆయన తీరును తప్పుబట్టే విధంగా ఉన్నాయి. ఏదైనా సినిమా ప్రమోషన్‌కు వెళ్లిన సమయంలో ఆ సినిమా గురించి గొప్పగా చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు...

నాగార్జునపై పరిశ్రమ ప్రముఖుల ఆగ్రహం-Hero Nagarjuna Tongue Slip About Tollywood Movies

చెత్త సినిమా అయినా బాగుందని చెప్పుకోవచ్చు. కాని అదే సమయంలో ఇతర సినిమాలను తక్కువ చేసి మాట్లాడటం ఎంత మాత్రం సమంజసం కాదు అంటూ సినీ వర్గాల వారు నాగార్జున చేసిన వ్యాఖ్యల విషయంలో చర్చించుకుంటున్నారు. ఈ సంవత్సరంలో పలు మంచి చిత్రాలు వచ్చాయి, కాని నాగార్జునకు అవేవి కనిపించడం లేదట.

అసలు విషయానికి వస్తే నాగార్జున తాజాగా అడవి శేషు నటించిన ‘గూఢచారి’ చిత్రం సక్సెస్‌ మీట్‌కు వెళ్లాడు. ఆ సమయంలో నాగార్జున మాట్లాడుతూ ఈ సంవత్సరం విడుదలైన చిత్రాల్లో మంచి సక్సెస్‌ను అందుకున్న చిత్రాలు రంగస్థలం, మహానటి తర్వాత గూఢచారి అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ మూడు చిత్రాలు తప్ప మరే సినిమా కూడా నాగార్జునకు కనిపించడం లేదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. నాగార్జున వ్యాఖ్యలు మరీ అతిగా ఉన్నాయని, కొన్ని సూపర్‌ హిట్స్‌ అయిన చిత్రాలను కూడా ఆయన మర్చిపోయినట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సంవత్సరంలో భరత్‌ అనే నేను, తొలిప్రేమ, భాగమతి, ఆర్‌ఎక్స్‌ 100తో పాటు ఇంకా కొన్ని చిన్న చితకా చిత్రాలు కూడా మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఇలాంటి సమయంలో నాగార్జున ఎలా ఆ మూడు సినిమాలు మాత్రమే సక్సెస్‌ అయ్యాయి అంటూ కామెంట్‌ చేస్తాడు. భరత్‌ అనే నేను చిత్రం 100 కోట్ల షేర్‌ను దక్కించుకుంది. అది నాగార్జునకు కనిపించడం లేదా అంటూ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. .

తొలిప్రేమ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు మంచి వసూళ్లు సాధించింది. ఇక ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం కేవలం రెండున్నర కోట్లతో తెరకెక్కి పది కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. భాగమతి కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది.

అయినా కూడా ఈ చిత్రాలు నాగార్జునకు కనిపించలేదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.