డ్రిల్ ముక్క అతడి గుండెలోకి బుల్లెట్ లా దూసుకుపోయింది..ప్రాణం పోయిందనే అనుకున్నాడు.కానీ..  

Hart Damaged By Drill Machine Bit In To Hart-

మన శరీరంలో గుండె,మెదడు చాలా చాలా ముఖ్యమైన అవయవాలు.వాటికి ఏం జరిగినా ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే...

డ్రిల్ ముక్క అతడి గుండెలోకి బుల్లెట్ లా దూసుకుపోయింది..ప్రాణం పోయిందనే అనుకున్నాడు.కానీ..-Hart Damaged By Drill Machine Bit In To Hart

కానీ బుల్లెట్ లా గుండెలోకి దూసుకెళ్లిన డ్రిల్ ముక్క,గుండెను చిధ్రం చేసినప్పటికి ,దానిని జాగ్రత్తగా తొలగించిన ఓ యువకుడి ప్రాణాలు కాపాడారు డాక్టర్లు…గుండె కొట్టుకుంటుండగానే. సున్నితమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.

నోయిడాకు చెందిన సతీష్ కుమార్ డ్రిల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు.ప్రతిరోజులానే ఆ రోజు కూడా తన పని తాను చేస్తుండగా.హఠాత్తుగా 4 సెం.మీ. పొడవైన డ్రిల్ ముక్క అతడి గుండెల్లోకి దూసుకెళ్లింది.ఏం జరుగుతుందో తెలిసేలోపే సతీష్ కుప్పకూలిపోయాడు. ప్రధాన ధమనికి కొద్ది మిల్లీ మీటర్ల పక్కన అది గుచ్చుకుంది.

దీంతో అతడికి తీవ్రంగా రక్తస్రావమైంది. అప్పటికే రక్తం బాగాపోవడం, గుండెలోకి డ్రిల్ ముక్క దిగబడటంతో. అతడు బతికే అవకాశాలు తక్కువని అతని కుటుంబసభ్యులు,బంధువులు ఒక నిర్ణయానికి వచ్చారు.మొదట డాక్టర్లు కూడా అదే విషయం తేల్చారు..

కానీ అతణ్ని బతికించడం సవాల్ గా తీసుకున్నారు.అందుకోసం క్లిష్టమైన అత్యవసర సర్జరీకి సిద్ధపడ్డారు.

అతణ్ని బతికించడం కోసం చిమ్మట లాంటి పరికరాన్ని గుండెలోకి జొప్పించి లోతుగా గుచ్చుకున్న ఇనుప ముక్కను తొలగించారు.గుండె కొట్టుకుంటుండగానే.

స్పెషలిస్టుల బృందం చాకచక్యంగా డ్రిల్ ముక్కను తొలగించింది. డ్రిల్ ముక్క కారణంగా సతీష్ హృదయ కుహరానికి గాయం కాగా...

దాన్ని కూడా రిపేర్ చేశారు. సర్జరీ జరిగిన నాలుగు రోజుల తర్వాత అతడు కోలుకున్నాడు.

డ్రిల్ ముక్క బుల్లెట్‌లా గుండెకు గాయం చేసిందని సర్జరీ నిర్వహించిన డాక్టర్ల బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ మిశ్రా తెలిపారు.