'కారు' .. కంగారు.. ఏంటి ఈ రివర్స్ గేర్ ..? టీఆర్ఎస్ లో ఇదో టెన్షన్  

Group Politics Effect On Trs Party-

ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఏంటో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి బాగా తెలిసొచ్చినట్టు కనిపిస్తోంది. అసెంబ్లీని రద్దు చేయక ముందు గులాబీ పార్టీలో కనిపించిన జోష్ ఇప్పుడు ఏమాత్రం కనిపించడంలేదు. పైకి ఆ విష్యం చెప్పకపోయినా ..

'కారు' .. కంగారు.. ఏంటి ఈ రివర్స్ గేర్ ..? టీఆర్ఎస్ లో ఇదో టెన్షన్ -Group Politics Effect On Trs Party

ఎందుకో కేసీఆర్ లో ఆ ఆందోళన కనిపిస్తోందని టీఆర్ఎస్ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. 105 మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఏదో ఘనకార్యం చేశానని కేసీఆర్ భావించాడు. కానీ టికెట్ మీద ఆశలు పెట్టుకున్న నేతలు మాత్రం తమ అసమ్మతి దెబ్బ ఎలా ఉంటుందో తమ బాస్ కి తెలిసొచ్చేలా చేస్తున్నారు.

పార్టీలో అసమ్మతి జ్వాలలు అధిష్టానాన్ని టెన్షన్ పెడుతున్నాయి. అందుకే పార్టీ ప్రచారం, ఆశీర్వాద సభల విషయంలో గులాబీ బాస్‌ సందిగ్ధంలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. అంసతృప్తులను బుజ్జగించి అప్పుడు జనాల్లోకి వెళ్తే ఫలితం ఉంటుందని లేకపోతే పార్టీ ఇమేజ్ కి డ్యామేజ్ జరగడం ఖాయం అని టీఆర్ఎస్ అధినాయకత్వం భయపడుతోంది.

తెలంగాణాలోని అన్ని జిల్లాలోనూ … టీఆర్ఎస్ నాయకుల అసమ్మతి జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో నల్లాల ఓదెలు, వరంగల్‌లో కొండా సురేఖ, పటాన్ చెరులో అనిల్ టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారు.

అయితే సీఎం కేసీఆర్‌ సూచనతో ఓదేలు కాస్త వెనక్కు తగ్గినట్టు కనిపిస్తున్నా. ఆయన అభిమానుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి కనిపిస్తూనే ఉంది.

కొండా సురేఖ నేరుగా మంత్రి కేటీఆర్ సహా ఇతర టిఆర్‌ఎస్‌ నేతలపై ఫైర్ అయ్యారు. రేపో మాపో కాంగ్రెస్ తీర్థం కూడా పుంచుకునేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ పరిస్థినతిని చక్కదిద్దెందుకు అసమ్మతి నాయకులు కొంతమందికి కేసీఆర్ రాయబారం పంపుతున్నాడు. ప్రగతి భవన్‌కు పిలిపించుకొని కేసీఆర్‌ పలు హామీలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నల్లాల ఓదెలుతో కూడా కేసీఆర్‌ మాట్లాడారు.

ఆ వెంటనే తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఓదేలె వివరణ ఇచ్చారు. ఇంకా చాలా చోట్ల అసమ్మతులు దారిలో రాకపోవడంతో. ప్రచారానికి ఆటంకం ఏర్పడుతోంది. దీంతో పలువురు కీలక నేతలకు, అభ్యర్థులకు కేసీఆర్‌ నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడారు. టికెట్‌ రాని వాళ్లను బుజ్జగించే బాధ్యతని స్థానిక అభ్యర్థులు, మాజీ మంత్రులకే అప్ప చెప్పారు.

పరిస్థితి పూర్తిగా సద్దు మణిగిన తరువాతే మరో ఆశీర్వాద సభ ఏర్పాటు చేస్తే మేలని టిఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి.