హిజ్రాగా మారిన గౌతం గంభీర్..ఎందుకో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు.!  

  • సమాజంలో హిజ్రాలపై ఉన్న చిన్నచూపు అంతా ఇంతా కాదువారిని మనుషులుగా గుర్తించేది అతి తక్కువ మంది అటువంటి వారు కనిపిస్తే హేళన చేస్తూ,జోకులేసుకుంటూ నవ్వుకునే వారే ఎక్కువకానీ టీం ఇండియా ఆటగాడు గౌతమ్ గంభీర్ వారికి తోడుగా నిలబడడానికి ముందుకొచ్చాడు…సోషల్ మీడియా వేదికగా వారి పట్ల చిన్నచూపును చెరిపేసేందుకు తనదైన శైలిలో హిజ్రాలకు సపోర్ట్ చేశాడు…

  • Gautam Gambhir Inaugurate The Seventh Edition Of Hijra Habba-

    Gautam Gambhir Inaugurate The Seventh Edition Of Hijra Habba

  • గౌతమ్ గంభీర్ సామాజిక సేవలో ఎప్పుడు ముందుంటాడు. సమాజంలో జరుగుతున్న కొన్ని అవాంఛనీయ సంఘటనలు, ఇతర ఘటనల గురించి సోషల్‌మీడియా వేదికగా అతను గళమెత్తుతూ ఉంటాడు.ఎవరైనా కష్టాల్లో ఉంటే తానున్నానంటూ ముందుకొస్తాడుఅందులో భాగంగా హిజ్రాలపై ఉన్న చిన్న చూపుని చెరిపేసేందుకు గంభీర్ తాజాగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందుకు నాందిగా ఈ ఏడాది రక్ష బంధన్ రోజున అతను హిజ్రాలతో రాఖీలు కట్టించుకొని ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు…క్రికెటర్లందరూ ఓనమ్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతుంటే హిజ్రాల చేత రాఖీలు కట్టించుకుని గౌతమ్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపాడు

  • Gautam Gambhir Inaugurate The Seventh Edition Of Hijra Habba-
  • అంతేకాదు తాజాగా హిజ్రాలకు మ‌ద్దతు ప‌లుకుతూ హిజ్రా వేషాన్ని ధ‌రించాడు గంభీర్. ఢిల్లీలో హిజ్రాల‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో అత‌ను బొట్టు పెట్టుకుని హిజ్రాలు వేసుకునే దుస్తులు ధ‌రించాడు.ఇందుకు సంబంధించిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. తన స్థాయిని పక్కన పెట్టి హిజ్రాల కోసం ఇలాంటి పని చేసిన గంభీర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలంటూ సోషల్‌మీడియాల్లో కామెంట్లు చేస్తున్నారు.