కృష్ణాష్టమి రోజున చేయకూడని పనులు ఏంటో తెలుసా  

Do\'s And Don\'ts At Krishnashtami Festival Of Lord Krishna-

Lord Krishna is the eighth incarnation of Lord Vishnu, who was born to restore Dharma on earth. Krishna devotees celebrate Janmashtami festival with great devotion and enthusiasm across the country. This festival is celebrated during the birth anniversary of Srikrishna and each one remembers the birth story of Lord Krishna. Many devotees of Krishna are fasting on this day. Some follow Krishna's grace and some rules. Let's now learn about some things that can not be done today.

.

It is also unfortunate that cutting trees on Janmashtami. The number of members of a family should be planted to the appropriate plants. If this is done, the house will be fine. .

· According to Hinduism, devotees do not eat non-vegetarian food during festivals. During the four months of the Chaturveda, Lord Vishnu sleeps, and Shiva takes that responsibility. Alcohol should not be eaten on Janmashtami day .. · Brahmacharya should be performed on Janmashtami. Today we need to avoid physical relations. On this day the holy devotees must worship Krishna. On this day, if you do not practice brahmacharya, all the attempts to get Krishna to waste will be wasted.

..

..

..

విష్ణు భగవానుని ఎనిమిదవ అవతారం అయిన శ్రీకృష్ణుడు, భూమిపై ధర్మాన్ని పునరుద్ధరించడానికి జన్మించాడని పురాణాలు చెబుతాయి. దేశవ్యాప్తంగా కృష్ణ భక్తులు అత్యంత భక్తిప్రపత్తులతో మరియు ఉత్సాహంతో జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు...

కృష్ణాష్టమి రోజున చేయకూడని పనులు ఏంటో తెలుసా-Do's And Don'ts At Krishnashtami Festival Of Lord Krishna

శ్రీకృష్ణుని జన్మదినోత్సవ సందర్భంగా జరుపుకునే ఈ పండుగనాడు, ప్రతి ఒకరు శ్రీ కృష్ణుని జన్మ వృత్తాంతంను గుర్తుచేసుకుంటారు. కృష్ణ భక్తులు చాలా మంది, ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. కొందరు శ్రీకృష్ణుని అనుగ్రహ ప్రాప్తికై, కొన్ని నియమాలను అనుసరిస్తారు.

ఈ రోజు చేయకూడని కొన్ని పనులను గురించి, ఇప్పుడు తెలుసుకుందాం.

· జన్మాష్టమి రోజున, తులసి ఆకులను కోయరాదు.కానీ విష్ణువుకి సమర్పించడానికైతే కోయవచ్చు.ఎందుకంటే తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రియమైనది.

అంతేకాదు తులసి విష్ణువుని వివాహం చేసుకోవాలని తీవ్రమైన తపస్సు చేసింది.కాబట్టి తులసికి ప్రీతిపాత్రమైన విష్ణువుకి సమర్పించడానికి తులసి ఆకులను కోయవచ్చు...

· కృష్ణుడికి ప్రియమిత్రుడైన సుధాముడు, పేదవాడు అయినప్పటికీ కృష్ణుడికి అత్యంత ప్రియమైనవాడు.

కనుక ఈ రోజున, పేదలను అవమానిస్తే కృష్ణుడిని అసంతృప్తికి లోనుచేస్తుంది.ఈ రోజున అగౌరవ పరచకుండా,వీలైతే పేదలకు విరాళం ఇవ్వడం వలన కృష్ణుడి అనుగ్రహం పొందినవారవుతారు.

· జన్మాష్టమి నాడు చెట్లను నరకడం కూడా దురదృష్టకరం అని భావిస్తారు.

ఒక కుటుంబంలోని సభ్యుల సంఖ్యకు తగినన్ని మొక్కలు నాటాలి. ఇలా చేస్తే, ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది.

· హిందూమతం ప్రకారం, భక్తులు పండుగలప్పుడు,శుభకార్యాలప్పుడు మాంసాహార ఆహారాన్ని తీసుకోరు. నాలుగు నెలల చతుర్మాస సమయంలో, విష్ణువు నిద్రిస్తున్నందున, శివుడు ఆ బాధ్యతలను తాను తీసుకుంటాడు.

జన్మాష్టమి రోజున, మద్యం కూడా సేవించరాదు...

· జన్మాష్టమి నాడు బ్రహ్మచార్యము పాటించాలి. ఈనాడు శారీరక సంబంధాల నుండి దూరంగా ఉండాలి.

ఈ రోజున పవిత్రమైన తనుమనస్సులతో కృష్ణుడిని పూజించాలి. ఈ రోజున, బ్రహ్మచర్యాన్ని పాటించకపోతే, కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలు వృధా అవుతాయి.

· కృష్ణుడికి ఆయనకు ఆవులు ఎంత ప్రియమైనవో మనకు తెలిసిందే.

తన చిన్నతనం అంతా ఆవులతో గడిచిందనే చెప్పొచ్చు…కాబట్టి జన్మాష్టమి రోజును ఆవులను పూజించే వ్యక్తికి, తప్పక కృష్ణుడి ఆశీస్సులు లభిస్తాయి.ఒక గోశాలకు విరాళము ఇవ్వడం, లేదా ఒక గాయపడిన ఆవుకు ఆహారాన్ని అందించడానికి సహాయం చేస్తే మంచిది.