'బతుకమ్మ' ను నీటిలోనే ఎందుకు వదులుతారో తెలుసా.? వెనకున్న కారణాలు ఇవే.!  

 • బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో
  బంగారు బతుకమ్మ ఉయ్యాలో
  నానోము పండింది ఉయ్యాలో
  నీనోము పండిందా ఉయ్యాలో
  మావారు వచ్చిరి ఉయ్యాలో
  మీవారు వచ్చిరా ఉయ్యాలో

 • Do You Know Why Bathukamma Drops In Water-

  Do You Know Why Bathukamma Drops In Water

 • ఊరూరావాడవాడలా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయిఆడపడుచులు మెట్టినింటి నిండి పుట్టింటికి చేరుకుని ,రకరకాల పూలను త్రికోణాకారంలో పేర్చి బతుకమ్మను చేసి దాని చుట్టూ పాటలు పాడుకుంటూ ,ఆటలు ఆడుతూ సంబరాలు చేసుకోవడం స్టార్టయిందిదసరాకి తొమ్మిది రోజుల ముందు ఎంగిలి పూవు బతుకమ్మ దగ్గరినుండి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వరకు ప్రతి ఇంట్లో ప్రతిరోజు సంబరమే తెలంగాణా ప్రాంతానికి మాత్రమే చెందిన ఈ పండుగ ఉత్సాహం అంతా ఇంతా కాదు చిన్న,పెద్దా ముసలి ముతక అందరూ ఎంజాయ్ చేసే పండుగ.

 • Do You Know Why Bathukamma Drops In Water-
 • మగవాళ్లంతా గూనుగు పువ్వు తంగేడు పువ్వు రకరకాల పువ్వులు సేకరించి తెస్తేఆడవాళ్లు ముస్తాబు అయిబతుకమ్మను అందంగా ముస్తాబు చేసిసాయంత్రం ఒక చోట చేరి బతుకమ్మ ఆట ఆడిన తర్వాత బతుకమ్మను నీళ్లల్లో పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా అంటూ వదిలేస్తారుఇలా వదిలేయడం వెనుక ఒక ఉపయోగం ఉందివర్షాకాలం ముగిసి చలికాలం ప్రారంభంలో వచ్చే బతుకమ్మ పండుగ సమయానికి నదులు,వాగులు నిండి ఉంటాయిబతుకమ్మకొరకు వాడే గునుగు పువ్వు,తంగేడు పూవులకు నీటిని శుధ్ది చేసే గుణం ఉంటుంది.కాబట్టి పర్యావరణానికి కూడా తోడ్పడుతుంది
  Attachments area