ఎవ్వరిని నొప్పించకుండా సాగబోతున్న ఎన్టీఆర్‌.. అసలు విషయాలు దాచనున్నారా?  

Director Krish Caring About Ntr Biopic-

The biopic buzz that started in Bollywood is slowly shifting to Tollywood. The biopics of Tollywood are coming forward to the audience. Savitri has already come forward with audiences. Nandamuri Taraka Rama Rao's biographical film will be released next year as 'NTR' for Sankranti. From the bottom to the star hero, and later in the national-level politics as an influential leader, there is the shooting of NTR Biopic.

.

Krrish is directing this film as Balakrishna Dream project. Everything is anticipating how director Krish will show you how much of the controversial ones are NTR biopic. There is no dispute at NTR's hero. After getting into politics, Lakshmi was married to Parvati and later Nandenda Bhaskar Rao lost her job. .

Chandra Babu Naidu came to power again and gave him the power to stand up. Everything is looking forward to how the NTR is going to be shown in the film. Director Krish does not want any dispute with the film. That's why the film is not going to show a backup item in the film without any criticism of the film. As NTR CE, you lose the job and get the information as simple as a single scene. .

బాలీవుడ్‌లో మొదలైన బయోపిక్‌ల సందడి మెల్ల మెల్లగా టాలీవుడ్‌కు పాకింది. వరుసగా టాలీవుడ్‌లో బయోపిక్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే మహానటి చిత్రంతో సావిత్రి జీవిత చరిత్ర ప్రేక్షకుల ముందుకు వచ్చింది...

ఎవ్వరిని నొప్పించకుండా సాగబోతున్న ఎన్టీఆర్‌.. అసలు విషయాలు దాచనున్నారా?-Director Krish Caring About NTR Biopic

ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ‘ఎన్టీఆర్‌’ చిత్రంగా నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర మూవీ రాబోతుంది. కింది స్థాయి నుండి స్టార్‌ హీరోగా ఎదిగి, ఆ తర్వాత జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా ప్రభావవంతమైన నాయకుడిగా వెలుగు వెలిగిన ఎన్టీఆర్‌ బయోపిక్‌కు షూటింగ్‌ జరుగుతున్న విషయం తెల్సిందే.

బాలకృష్ణ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రంకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ అనగానే పలు వివాదాస్పద విషయాలను గురించి దర్శకుడు క్రిష్‌ ఎలా చూపిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్‌ హీరోగా ఉన్న సమయంలో ఎలాంటి వివాదాలు లేవు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవడం, ఆ తర్వాత ఒకసారి నాదెండ భాస్కర్‌ రావు వల్ల పదవి కోల్పోవడం జరిగింది..

నాదెండ్ల నుండి మళ్లీ అధికారం దక్కించుకున్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వెన్ను పోటు పొడిచి అధికారంను దక్కించుకున్నాడు. ఈ మూడు విషయాల గురించి ఎన్టీఆర్‌ చిత్రంలో ఎలా చూపించబోతున్నారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రంతో ఎలాంంటి వివాదాన్ని కోరుకోవడం లేదు. అందుకే ఈ చిత్రంలో ఎవరిని ఉద్దేశించి విమర్శలు చేయకుండా, అసలు ఈ చిత్రంలో వెన్నుపోటు అంశంను చూపించబోవడం లేదు. ఎన్టీఆర్‌ సీఎంగా పదవి కోల్పోవడంను సింపుల్‌గా సింగిల్‌ సీన్‌లో చెప్పబోతున్నట్లుగా సమాచారం అందుతుంది...

ఇప్పటికే నాదెండ్ల కుటుంబ సభ్యులు తమ గురించి ఏదైనా తప్పుడు సమాచారం ప్రేక్షకులకు చూయించే ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్తామని చెప్పుకొచ్చాడు. ఇక చంద్రబాబు నాయుడుకు బాలకృష్ణ చాలా ఆత్మీయంగా ఉన్నాడు. అందుకే చంద్రబాబు నాయుడు గురించి క్రిష్‌ చెప్పే పరిస్థితి లేదు. అందుకే ఏ ఒక్కరిని నొప్పించకుండా సినిమాను క్రిష్‌ పూర్తి చేయాలని భావిస్తున్నాడు.

ఈ చిత్రంలో విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, కైకాల సత్యనారాయణ ఇంకా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.