బ్లాక్‌మెయిల్‌ చేసి ‘నోటా’ను దక్కించుకున్న దిల్‌రాజు..!  

Dil Raju Acquires The Nizam Rights Of Nota Movie-

విజయ్‌ దేవరకొండ హీరోగా ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ద్వి భాష చిత్రం ‘నోటా’. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాల తర్వాత విజయ్‌ దేవరకొండ నటిస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా తాను ఈ సినిమాను తీశాను అంటూ దర్శకుడు చెబుతూ వస్తున్నాడు...

బ్లాక్‌మెయిల్‌ చేసి ‘నోటా’ను దక్కించుకున్న దిల్‌రాజు..!-Dil Raju Acquires The Nizam Rights Of Nota Movie

తాజాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రా పంపిణీ హక్కులను దిల్‌రాజు సొంతం చేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఈ చిత్రంను తమిళ నిర్మాత జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన విషయం తెల్సిందే. తెలుగులో మంచి సినిమాలను ఈయన అందించాడు. ఈయన గతంలో పలు తమిళ సినిమాలు నేరుగా తెలుగులో విడుదల చేయడం జరిగింది.

కాని ‘నోటా’ విషయంలో మాత్రం అది సాధ్యం కాలేదు. జ్ఞానవేల్‌ రాజా తెలుగులో ఈ చిత్రంను విడుదల చేసేందుకు థియేటర్ల సమస్య వచ్చింది. ఎంత ప్రయత్నించినా కూడా 300 నుండి 350 థియేటర్ల వరకే సమకూరుతున్నాయి. దాంతో పంపిణీ హక్కులను దిల్‌రాజుకు అప్పగించినట్లుగా సమాచారం అందుతుంది..

దిల్‌రాజు చాలా తెలివిగా ‘నోటా’ హక్కులు దక్కించుకున్నాడు అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ఆధీనంలో ఉన్న థియేటర్‌లను జ్ఞానవేల్‌ రాజాకు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. దాంతో ఆయనకు మరో దారి లేక పోవడంతో పంపిణీ హక్కులను దిల్‌రాజుకు ఇవ్వాల్సి వచ్చిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తనకు రైట్స్‌ ఇస్తేనే ఎక్కువ థియేటర్లలో సినిమా ఆడనిస్తాను అంటూ ఇండైరెక్ట్‌గా దిల్‌రాజు బ్లాక్‌ మెయిల్‌ చేయడం వల్ల నోటాను జ్ఞానవేల్‌ రాజా తప్పనిసరి పరిస్థితుల్లో వదులుకోవాల్సి వచ్చిందనే టాక్‌ వినిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో నోటా చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. సునాయాసంగా 25 కోట్ల షేర్‌ను రాబట్టడం ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు కూడా అంటున్నారు. అందుకే దిల్‌రాజు ఈ చిత్రంను దక్కించుకునేందుకు ఇలా ప్రయత్నించినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి దిల్‌రాజు అనుకున్నది సాధించి నోటాను తన చేతుల మీదుగా విడుదల చేయబోతున్నాడు...