నాగార్జున, నాని.. ఇద్దరికి ఇదే ఫస్ట్‌ టైం  

Devadas Makes A Decent Pre-release Business-

నాగార్జున, నాని కలిసి నటించిన ‘దేవదాస్‌’ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రానికి శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా భారీ బిజినెస్‌ను చేయడం జరిగింది...

నాగార్జున, నాని.. ఇద్దరికి ఇదే ఫస్ట్‌ టైం-Devadas Makes A Decent Pre-Release Business

విడుదలకు ముందే చిత్ర నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టిన దేవదాస్‌ చిత్రం సినీ వర్గాల్లో అంచనాలను రేకెత్తిస్తోంది. నాగార్జున మరియు నాని కెరీర్‌లో మొదటి సారి భారీగా బిజినెస్‌ను సాధించిన చిత్రంగా ఈ చిత్రం నిలిచింది.

అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం ఏకంగా 37.2 కోట్ల రూపాయల బిజినెస్‌ చేసినట్లుగా సమాచారం అందుతుంది. అందుకు సంబంధించిన అధికారిక లెక్కలు కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేయడం జరిగింది.

ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన దేవదాస్‌ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఇద్దరు హీరోలు నటించినప్పటికి ఈ చిత్రానిన తక్కువ బడ్జెట్‌తో నిర్మాత అశ్వినీదత్‌ నిర్మించాడు. కనుక ఇప్పటికే నిర్మాత ఖాతాలో 15 కోట్ల మేరకు థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా లాభం దక్కింది. .

కేవలం థియేట్రికల్‌ రైట్స్‌ కాకుండా ఇతర రైట్స్‌ కూడా భారీ మొత్తంకు అమ్ముడు పోయింది.

కనుక ఆ రైట్స్‌ ద్వారా నిర్మాతకు మరో 10 కోట్ల మేరకు వచ్చే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది. అంటే మొత్తగా విడుదలకు ముందే నిర్మాత 25 కోట్ల టేబుల్‌ ప్రాఫిట్‌ను దక్కించుకున్నట్లుగా సినీ వర్గాల వారు అంచనా వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున కెరీర్‌లో ఇప్పటి వరకు ఇలాంటి బిజినెస్‌ చూసింది లేదు. నాని కూడా ఇప్పటి వరకు 25 కోట్ల బిజినెస్‌ దాటలేదు. కాని ఈ చిత్రం మాత్రం 47 కోట్లకు మించి బిజినెస్‌ అవ్వడం ట్రేడ్‌ వర్గాల వారిని కూడా ఆశ్చర్య పర్చుతుంది.

ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా ఆకాంక్ష హీరోయిన్‌గా నటించగా, నానికి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అంటూ సినీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘దేవదాస్‌’ మల్టీస్టారర్‌ చిత్రాల హవాను మరింతగా పెంచుతారనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.